మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Theppa Samudram: మూడు రోజుల్లో రూ.2.25 కోట్లు.. నిర్మాత హ్యాపీ

ABN, Publish Date - Apr 22 , 2024 | 08:25 PM

అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లో రూ.2.25 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని నిర్మాత నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ తెలిపారు.

Theppa Samudram Poster

‘బిగ్ బాస్’ ఫేం అర్జున్ అంబటి (Arjun Ambati) హీరోగా, కిశోరి దాత్రక్ (Kishori Dhatrak) హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’ (Theppa Samudram). సతీష్ రాపోలు (Sateesh Rapolu) దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈచిత్రం అన్ని కేంద్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. వాస్తవ సంఘటనలతో.. అనేక మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించిన ఈ చిత్రం క్రిటిక్స్‌ను సైతం మెప్పించింది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లో రూ.2.25 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని నిర్మాత నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ (Nikrukanti Manjula Raghavendar Goud) తెలిపారు.


ఈ సందర్బంగా ఆయన ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో లీడ్ రోల్ పోషించిన అర్జున్ అంబటి, హీరోయిన్ కిషోరి దాత్రక్, చైతన్య రావుల నటనను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే లాయర్ విశ్వనాథ్ పాత్రలో రవిశంకర్ పోషించిన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అన్నారు. కొన్ని వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు సతీష్ రాపోలు ఎంచుకున్న కథ, కథనాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. (Theppa Samudram Collections)

Updated Date - Apr 22 , 2024 | 08:25 PM