Vishwambhara: జై చిరంజీవా... జగదేకవీరా... అంజనీ పుత్రా... చిరు లుక్ అదిరిందిగా

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:40 PM

చిరంజీవి మునుపెన్నడూ లేనివిధంగా 'విశ్వంభర' సినిమాలో ఒక పోరాట సన్నివేశానికి 26 రోజులు కేటాయించడం ఒక రికార్డు. ఈ పోరాట సన్నివేశం విరామం ముందు వస్తుందని చెపుతున్నారు, సినిమా జనవరి 10, 2025 సంక్రాంతికి విడుదల.

Vishwambhara: జై చిరంజీవా... జగదేకవీరా... అంజనీ పుత్రా... చిరు లుక్ అదిరిందిగా
Specially erected 54-feet Lord Hanuman and Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవి, దర్శకుడు వసిష్ఠతో 'విశ్వంభర' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక ఫాంటసీ నేపథ్యంలో సాగే, అత్యున్నత సాంకేతిక వినియోగిస్తూ చేస్తున్న సినిమా. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఇంకో నలుగురు కథానాయికలు కూడా ఉంటారని ఒక వార్త నడుస్తోంది. ఈషా చావ్లా కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈమధ్యనే ఒక అత్యద్భుత పోరాట సన్నివేశం చిత్రీకరణ పూర్తి చేసుకుందని చిత్ర నిర్వాహకులు తెలియచేశారు. (Chiranjeevi completed an high action scene which comes before interval)

ఈ పోరాట సన్నివేశం కోసం 54 అడుగులు హనుమంతుని విగ్రహం నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ హనుమంతుని విగ్రహం ఈమధ్యనే బాగా ప్రాచుర్యం కూడా పొందింది. చిరంజీవిని కలవడానికి వెళ్లిన అతని తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ హనుమంతుని విగ్రహం ముందరే చిరంజీవి అశీసులు తీసుకున్నారు. చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రూ. 5 కోట్ల రూపాయలు విరాళాన్ని ఈ హనుమంతుని విగ్రహం ముందే చెక్కుని బహుకరించారు.

chiranjeevilook.jpg

ఈ హుమంతుని విగ్రహాన్ని ప్రముఖ ఆర్ట్ దర్శకుడు ఎఎస్ ప్రకాష్ సారధ్యంలో నిర్మించినట్టు చెపుతున్నారు. ఈ విగ్రహం సుమారు 54 అడుగుల ఉందని, ఈ పోరాట సన్నివేశం ఈ విగ్రహం సెట్‌లో చిత్రీకరించారని తెలుస్తోంది. ప్రముఖ పోరాట దర్శకులు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ పోరాట సన్నివేశాన్ని పర్యవేక్షిస్తున్నారు. (Popular art director AS Prakash designed the 54-feet Hanuman Idol for an action scene) చిరంజీవి, ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ పోరాటం విరామం ముందు వచ్చే సన్నివేశం అని, ఇది అదిరిపోయే లెవెల్లో ఉందని తెలుస్తోంది. ఈ ఒక్క సన్నివేశానికి 26 రోజులు పని చేస్తినట్టు చెపుతున్నారు. మెగాస్టార్ ఇలా ఒక్క పోరాట సన్నివేశం కోసం ఇన్ని రోజులు కేటాయించడం ఇదే అత్యధికం. ఈ సీక్వెన్స్ షూటింగ్ ఈరోజుతో పూర్తవుతుంది అని నిర్వాహకులు చెపుతున్నారు. (Vishwambhara is releasing on January 10, 2025)

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Updated Date - Apr 22 , 2024 | 05:40 PM