మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rakshana: పాయ‌ల్ రాజ్‌పుత్ పోలీస్‌గా.. ఫస్ట్ లుక్ అదిరింది

ABN, Publish Date - May 11 , 2024 | 10:46 PM

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ర‌క్ష‌ణ‌’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు.

Payal Rajput

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ర‌క్ష‌ణ‌’ (Rakshana). రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటోంది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ (Prandeep Thakore) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

*AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న మద్దతు.. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ట్వీట్స్

ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన సినిమా ఇదని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా పాయ‌ల్‌ మెప్పించ‌బోతున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నట్లుగా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌ తెలిపారు. (Payal Rajput in Rakshana)


ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ర‌క్ష‌ణ’ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - May 11 , 2024 | 10:46 PM