Nenu Keerthana: ‘కొంచెం కొంచెం గుడు గుడు గుంజమ్’.. ఐటమ్‌కు అదిరే స్పందన
ABN, Publish Date - Jul 09 , 2024 | 02:11 PM
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను కీర్తన’ చిత్రం నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘కొంచెం కొంచెం గుడు గుడు గుంజమ్’ లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోందని తాజాగా మేకర్స్ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ లిరికల్ వీడియోను ప్రముఖ నటులు మురళీమోహన్ ఆవిష్కరించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చిమటా రమేష్ బాబు (Chimata Ramesh Babu) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను కీర్తన’ (Nenu Keerthana) చిత్రం నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘కొంచెం కొంచెం గుడు గుడు గుంజమ్’ (Konchem Konchem Gudu Gudu Gunjam Item Song) లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోందని తాజాగా మేకర్స్ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ లిరికల్ వీడియోను ప్రముఖ నటులు మురళీమోహన్ ఆవిష్కరించారు. అంచుల నాగేశ్వరరావుతో కలిసి చిమటా రమేష్ బాబు సాహిత్యం అందించిన ఈ పాటను హరి గుంట - లాస్య ప్రియ ఆలపించారు. ఎమ్.ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. హీరో రమేష్ బాబు - రేణు ప్రియలపై ఈ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరించారు.
Also Read- Siddharth: సిద్ధార్ధ్.. నీ అతి తగ్గించుకుంటే మంచిది..
చిమటా ప్రొడక్షన్స్ (Chimata Productions) పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్), రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా.. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను కీర్తన’ (Nenu Keerthana Movie). ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) రిలీజ్ చేసిన ‘సీతా కోకై’ లిరికల్ వీడియోతో పాటు.. జయభేరి అధినేత మురళీమోహన్ (Murali Mohan) ఆవిష్కరించిన ‘కొంచెం కొంచెం గుడు గుడు గుంజమ్’ లిరికల్ వీడియోకు కూడా అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ రెండు పాటలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మల్టీ జోనర్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తై.. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రంలో కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు.. ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయ. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. (Nenu Keerthana Movie Update)
Read Latest Cinema News