Nenu Keerthana: ‘నేను-కీర్తన’కు మురళీ మోహన్ సపోర్ట్

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:35 PM

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం అవుతూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఈ చిత్రం నుంచి ఐటమ్ సాంగ్‌ని నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Nenu Keerthana: ‘నేను-కీర్తన’కు మురళీ మోహన్ సపోర్ట్
Murali Mohan and Chimata Ramesh Babu

‘‘ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘నేను - కీర్తన’ ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా నేను విడుదల చేసిన ఈ ఐటమ్ సాంగ్ థియేటర్స్‌లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. అందరూ ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు నటులు - మాజీ పార్లమెంటు సభ్యులు - జయభేరి అధినేత మాగంటి మురళీమోహన్ (Maganti Murali Mohan). తాజాగా ఆయన ‘నేను - కీర్తన’ (Nenu Keerthana) చిత్రంలోని ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ అనే ఐటమ్ సాంగ్‌ను ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను (Chimata Ramesh Babu) దర్శకుడిగా పరిచయం అవుతూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఈ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. (Nenu Keerthana Item Song Launched)


Nenu-Keerthana.jpg

పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘సినిమాలు, స్థిరాస్తి, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభాశాలి మాగంటి మురళీమోహన్ మా చిత్రం నుంచి ఐటమ్ సాంగ్ విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని అభిలషించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సపోర్ట్ మరిచిపోలేనిది. సినిమాకు సంబంధించి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు.. ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అని తెలిపారు.

Read Latest Cinema News

Nenu-Keerthana-2.jpg

Updated Date - Jun 26 , 2024 | 07:52 PM