HIT The 3rd Case: సెట్స్‌పైకి నాని 32వ సినిమా..

ABN , Publish Date - Sep 13 , 2024 | 07:32 PM

‘సరిపోదా శనివారం’ తర్వాత నాని చేస్తున్న సినిమాకు సంబంధించి రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ రాగా.. ఆ సినిమా శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటంటే..

Natural Star Nani

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయానంతరం నాని తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని చేస్తున్న సినిమాకు సంబంధించి రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ రాగా.. ఆ సినిమా శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నాని తన 32వ మూవీ ‘HIT: The 3rd Case’లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

Also Read- Devara: ‘దేవర’పై అంచనాలు తప్పాయా.. యుఎస్‌కు వెళ్లిపోతున్న తారక్..


Nani-Hit-3.jpg

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్‌లో నాని కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్‌గా మేకోవర్‌ అవుతున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. 1 మే, 2025న వేసవిలో HIT 3‌ని థియేటర్లలోకి తీసుకువస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Also Read- Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..

Also Read- Mathu Vadalara 2 Review: శ్రీసింహా నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2' ఎలా ఉందంటే 

Read Latest Cinema News

Updated Date - Sep 13 , 2024 | 07:32 PM