Hit 3: సైకో కిల్లర్‌గా.. నిజమేనా?

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:47 PM

హీరో నాని (Nani) నిర్మాణంలో వచ్చిన ‘హిట్‌’, హిట్‌-2 (Hit 2)చిత్రాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే! ఈ ఫ్రాంచైజీని  కొనసాగించాలనుకుంటున్నారు నాని. ఈ రెండు చిత్రాలకు నాని నిర్మాతగానే వ్యవహరించారు

Hit 3: సైకో కిల్లర్‌గా.. నిజమేనా?

హీరో నాని (Nani) నిర్మాణంలో వచ్చిన ‘హిట్‌’, హిట్‌-2 (Hit 2)చిత్రాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే! ఈ ఫ్రాంచైజీని  కొనసాగించాలనుకుంటున్నారు నాని. ఈ రెండు చిత్రాలకు నాని నిర్మాతగానే వ్యవహరించారు. రాబోతున్న 'హిట్‌ 3’లో (hit 3) హీరోగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో రానా 9Rana daggubaati) ప్రతినాయకుడిగా కనిపించే అవకాశాలున్నాయని సమాచారం. నాని, రానాల మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ బావ, బావ అని పిలుచుకుంటారు. ఓ అవార్డు వేడుకకు ఇద్దరూ హోస్ట్‌లుగా వ్యవహరించారు. తెరపై కనిపించబోతుండడం ఇదే మొదటిసారి. ఇప్పటికే శైలేష్‌ కొలను (Sailesh kolanu) కథ రెడీ చేసినట్టు సమాచారం. నాని కూడా ఈ కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. కాకపోతే.. సెట్స్‌ మీదకు ఎప్పుడు వెళ్తుందనేది తెలియాలి.

ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. తదుపరి శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే 'దసరా’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో మరో సినిమా చేయడానికి నాని రెడీ అవుతున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ‘హిట్‌ 3’ని ఫినిష్‌ చేయాల్సి ఉంటుంది. ‘హిట్‌’ ఓ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. సైకోలను పట్టుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఆ యాంగిల్ లో  చూస్తే.. ‘హిట్‌ 3’లో రానా సైకో కిల్లర్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - Jul 02 , 2024 | 01:07 PM