Akhanda 2: బాలయ్య పెద్ద కుమార్తె క్లాప్.. చిన్న కుమార్తె స్విచ్ఛాన్

ABN, Publish Date - Oct 16 , 2024 | 10:59 AM

ఇండియన్ సినిమాలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సక్సెస్‌ల తర్వాత రాబోతోన్న నాల్గవ చిత్రం ‘అఖండ 2’. నేడు ఈ చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర ప్రారంభ విశేషాల్లోకి వెళితే..

Akhanda 2 Movie Launch

ఇండియన్ సినిమాలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (God Of Masses Nandamuri Balakrishna) మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu)ల హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్- ‘సింహ, లెజెండ్ మరియు అఖండ’ చిత్రాల తర్వాత నాల్గవసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి చిత్రం ఒకదానిని మించి మరొకటి బాలయ్యకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ఇక వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న నాల్గవ చిత్రం నేడు (బుధవారం) గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇదే సందర్భంలో చిత్ర టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేస్తూ.. ఇది ‘అఖండ’‌ (Akhanda)కు సీక్వెల్ అని తెలుపుతూ.. ‘అఖండ 2’ (Akhanda 2) టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ప్రారంభ విశేషాలకు వస్తే..

Also Read- Akhanda 2: బాలయ్య, బోయపాటి BB4 టైటిల్ పోస్టర్ అదిరిపోలా..


ఈ చిత్రానికి నటసింహం బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా.. చిన్న కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి స్విచ్చాన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రారంభంలో క్లాప్, స్విచ్ఛాన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట ఈ ‘అఖండ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన ‘అఖండ’లో నటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది బాలకృష్ణ మరియు బోయపాటి ఇద్దరికీ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. ‘అఖండ’ చిత్రానికి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ సీక్వెల్‌కి కూడా సంగీతం అందిస్తున్నారు.

Also Read- Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2024 | 10:59 AM