BB4: బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలే.. మాస్ అప్డేట్

ABN , Publish Date - Oct 12 , 2024 | 01:21 PM

బాలయ్య, బోయపాటి వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని కోరుకొని బాలయ్య అభిమాని ఉండరు. ఈ క్రమంలోనే ఒక మాస్ మూవీ అప్డేట్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. ఆ అప్డేట్ ఏంటంటే..

BB4 POSTER

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోకి ఇండస్ట్రీలో ఉన్న క్రేజే వేరు. ఇక అభిమానులకైతే పూనకాలే. థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే. బాక్సాఫీస్ ఊపిరి ఆగిపోవాల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రిలీజైన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానికి మించి ఒకటి ఫాన్స్‌ని పిచ్చెక్కించాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని కోరుకొని బాలయ్య అభిమాని ఉండరు. ఈ క్రమంలోనే ఒక మాస్ మూవీ అప్డేట్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. ఆ అప్డేట్ ఏంటంటే..


ప్రస్తుతం దర్శకుడు కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో 'NBK109' వర్కింగ్ టైటిల్ తో బాలయ్య ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఆయనతో పాటు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా వంటి పరభాష నటులు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరు కోరుకున్నట్లుగానే విజయదశమి శుభ సందర్భంగా బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో BB4 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 14 రీల్స్ బ్యానర్‌లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా మూహూర్తం నెల 16న నిర్వహించనున్నారు. స్కంద సినిమా ఫ్లాప్ తర్వాత ఇది బోయ నెక్స్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదిఏమైనా బోయపాటి, నందమూరి కాంబినేషన్ సూనామీ కంటే పవర్ ఫుల్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2024 | 01:21 PM