మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nandamuri Balakrishna and Pawan Kalyan: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి అసెంబ్లీకి, ఇక దబిడి దిబిడే

ABN, Publish Date - Jun 03 , 2024 | 05:23 PM

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి భారీ మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు, ఇంకో పక్క నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుండి మరోసారి ఎంఎల్ఏ గా గెలుస్తారని కూడా తెలుస్తోంది. ఈ ఇద్దరు అగ్ర నటులు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడితే అది చూడటానికి కన్నుల పండగగా ఉంటుందని అభిమానులు అంటున్నారు.

Nandamuri Balakrishna and Pawan Kalyan

రేపు జూన్ 4 న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయి, ఎవరెవరు అసెంబ్లీకి వెళుతున్నారు అనే విషయం తెలిసిపోతుంది. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కూటమికి మెజారిటీ అని చెపుతూ వస్తున్నాయి, నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని కూడా చెపుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన ఇద్దరు అగ్ర నటులు అసెంబ్లీలో అడుగుపెట్టే విషయం కూడా రేపే తేలనుంది.

జన సేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అని అందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాగు గెలుస్తారు, అయితే మెజారిటీ ఎంత? లక్ష దాటుతుందా? రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తారా? అనే విషయంపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ బెట్టింగులు కూడా కోట్ల రూపాయాల్లో ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే హిందూపూర్ నుండి నందమూరి బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు, , ఎందుకంటే బాలకృష్ణ విజయం కూడా తథ్యం అని చెపుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. అయితే ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు ఈసారి అన్నదే ప్రశ్న. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఈసారి గెలుపొంది అసెంబ్లీలో కలిసి అడుగుపెడుతున్నారని అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు సంతోషంతో వున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అసెంబ్లీలోకి మొదటిసారిగా కలిసి అడుగుపెడితే ఇక దద్ధరిల్లిపోవాల్సిందే అని అభిమానులు అంటున్నారు. ఈ ఇద్దరూ ఆలా నడిచి వెళుతుంటే అభిమానులకి కన్నుల పండుగ అని ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నామని అభిమానులు అంటున్నారు. రేపు మధ్యాహ్నం వేళకి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందో తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా చిత్ర పరిశ్రమకి సంబంధించి నటి రోజా కూడా నగరి నియోజకవర్గం నుండి మరోసారి పోటీలో వున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 05:25 PM