Nandamuri Balakrishna: దబిడి దిబిడే అంటున్న బాలయ్య.. ఈ సారి కొత్త అవతారంలో..

ABN , First Publish Date - 2023-03-26T17:59:11+05:30 IST

అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరించిన హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా మరో కొత్త అవతారమెత్తనున్నారు. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్-2023 సీజన్‌‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

Nandamuri Balakrishna: దబిడి దిబిడే అంటున్న బాలయ్య.. ఈ సారి కొత్త అవతారంలో..

అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరించిన హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా మరో కొత్త అవతారమెత్తనున్నారు. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్-2023 సీజన్‌‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో కూర్చుని తెలుగు కామెంట్రీ వినిపించనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

బాలయ్య కామెంటర్‌గా వ్యవహరించనున్న విషయాన్ని తెలుపుతూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఇన్ క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్.. ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్ నందమూరి బాలకృష్ణతో.. తెలుగు జాతి గర్వపడేలా.. సంబరాన్ని అంటేలా.. ఎంటర్‌టైన్‌మెంట్ వేరే లెవెల్‌లో ఉండబోతుంది. మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD’’ అని ట్విటర్‌లో మెసేజ్‌ను షేర్ చేసింది.

బాలకృష్ణ చిన్నతనం నుంచి క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. కాలేజీ రోజుల్లో భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో కలసి క్రికెట్‌ ఆడేవారు. బాలయ్య గతంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహించారు. క్రికెట్ గురించి కొంచెం తెలుసు కాబట్టి అందువల్ల కామెంటర్‌గా వ్యవహరించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. వేణుగోపాల్‌ రావు, ఎంఎస్‌కే ప్రసాద్‌, ఆశిష్‌ రెడ్డి, కళ్యాణ్‌ కృష్ణ, టి సుమన్‌లతో కలసి బాలయ్య కామెంటర్‌గా వ్యవహరించనున్నారు. వ్యాఖ్యతగా అలరించిన బాలకృష్ణ కామెంటర్‌గా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ ఏడాది ఐపీఎల్-2023 సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T17:59:13+05:30 IST