Vishwambhara: దసరాకి మెగాస్టార్ ఇస్తోన్న ట్రీట్ ఇదే..

ABN, Publish Date - Oct 11 , 2024 | 06:31 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఎక్కడాలేని బజ్ సినిమాపై ఏర్పడింది. రీసెంట్‌గా మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ఇక విజయదశమి స్పెషల్‌గా ‘విశ్వంభర’ ఇవ్వబోతోన్న ట్రీట్ ఏంటంటే..

Vishwambhara Movie Still

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఎక్కడాలేని బజ్ సినిమాపై ఏర్పడింది. రీసెంట్‌గా మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ‘When Myths Collide Legends Rise’ అనే కోట్‌తో వున్న ఈ వండర్ ఫుల్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్ ఫుల్‌గా కనిపించారు. మెగాస్టార్ చరిష్మాటిక్ లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరపులతో కూడిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రేక్షకులందరినీ మెప్పించింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మెగాస్టార్ అండ్ టీమ్ దసరా ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఆ ట్రీట్ ఏంటంటే..

Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ

దసరా కానుకగా ‘విశ్వంభర’ టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయదశమి స్పెషల్‌గా శనివారం ఉదయం 10 గంటల 49 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ మరో పవర్ ఫుల్ పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చేతిలో మరో పవర్ ఫుల్ ఖడ్గం కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌కు కంటిన్యూటీ అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్.. సినిమాపై స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. ఎప్పుడెప్పుడు టీజర్ వదులుతారా? అనే క్యూరియాసిటీని సైతం ఈ పోస్టర్ కలిగిస్తుండటం విశేషం. అసలు ఊహించని విధంగా వచ్చిన ఈ అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిత్రయూనిట్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. (Vishwambhara Teaser Ready to Release)


డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు, ఇది టాప్-నాచ్ VFX, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, అద్భుతమైన డ్రామాతో విజువల్ వండర్‌గా ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తోంది, ఇందులో ప్రముఖ తారాగణం, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి విడుదల అని డేట్ ప్రకటించినా.. ఈ సినిమా విడుదల విషయంలో ప్రస్తుతం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 06:31 PM