Lucky Baskhar: ‘మాస్టారు మాస్టారు’ పాట తరహాలో ‘శ్రీమతి గారు’..
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:35 PM
దర్శకుడు వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్’ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇందులోని ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉందంటే.. ఆ పాట సాధించిన ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిదే కాంబినేషన్‌లో వస్తోన్న మరో చిత్రం ‘లక్కీ భాస్కర్’. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘శ్రీమతిగారు’ను మేకర్స్ విడుదల చేశారు.
దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్’ (Sir) చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందులోని పాటలు, అందులోనూ ‘మాస్టారు మాస్టారు’ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉందంటే.. ఆ పాట సాధించిన ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిదే కాంబినేషన్‌లో వస్తోన్న మరో చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘శ్రీమతిగారు’ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట కూడా ‘మాస్టారు మాస్టారు’ పాటంత గొప్పగా ప్రేక్షకులని అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read- Vijay: విజయ్ పార్టీలో చేరనున్న ఆ ఇద్దరు నటులు?
‘మహానటి’, ‘సీతా రామం’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకుని, తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ అంటూ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘శ్రీమతి గారు’ (Srimathi Garu) అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ వినసొంపుగా ఉంది. వయోలిన్‌తో మొదలై, ఫ్లూట్ మెలోడీగా మారి, డ్రమ్ బీట్‌లతో మరో స్థాయికి వెళ్లి.. ఇలా మొత్తంగా ఎంతో అందంగా సాగిందీ పాట. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు ఆలపించిన ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు’ అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాట ఉంది. ముఖ్యంగా ఇందులో కోపగించుకున్న భార్య పట్ల భర్తకు గల వాత్సల్యాన్ని తెలుపుతూ.. ‘చామంతి నవ్వు’, ‘పలుకే ఓ వెన్నపూస’ వంటి పదబంధాలను ఉపయోగిస్తూ, గాఢమైన ప్రేమను వ్యక్తీకరించారు. దుల్కర్ సల్మాన్ సరసన ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయికగా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
Read Latest Cinema News