Kubera: వినాయకచవితి స్పెషల్‌గా వచ్చిన ‘కుబేర’ పోస్టర్ వైరల్

ABN, Publish Date - Sep 08 , 2024 | 05:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమా టీమ్ ఓ పోస్టర్‌ని విడుదల చేయగా.. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Kubera Movie Still

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ (Kubera). ఈ సినిమాకు సంబంధించిన లీడ్ రోల్స్‌తో సహా రష్మిక మందన్న (Rashmika Mandanna) పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌ హ్యుజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ధనుష్, నాగార్జునలను ఒకే పోస్టర్ ద్వారా చూపిస్తూ.. యూనిట్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

Also Read- Jailer Villain: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ విలన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఈ పోస్టర్‌ ఈ సినిమాలో ధనుష్, నాగార్జున పోషించిన పాత్రల మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. ధనుష్ పాత్ర మ్యాసీ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించగా.. నాగార్జున లుక్ మోడరన్ అవుట్ ఫిట్స్‌లో స్టయిలీష్ అవతార్‌లో ఉంది. ఈ పోస్టర్ ‘కుబేర’ సినిమా థీం కోర్‌ని ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్‌లో చూపించిన డబ్బు కట్టలు, దాని మ్యాప్ ఇమేజ్ మొత్తం కూడా ఓ వైవిధ్యభరిత సినిమాను శేఖర్ కమ్ముల ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. (Kubera Vinayaka Chaturthi Wishes Poster)


ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇందులో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

Read Latest Cinema News

Updated Date - Sep 08 , 2024 | 05:14 PM