Devara: వినగానే ఆ పాటే గుర్తొస్తోంది.. ‘దేవర’ దావూదీ పాట ఎలా ఉందంటే..

ABN , Publish Date - Sep 04 , 2024 | 05:46 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీల కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది కానీ.. పాటే వేరే పాటను తలపిస్తుండటం గమనార్హం.

Devara Movie Still

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను గ్రాండ్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోన్నఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మూడో పాటను వీడియో సాంగ్‌గా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Ram Charan: రామ్ చరణ్ భారీ విరాళం.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..


ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ సాంగ్స్ మంచి స్పందనను రాబ‌ట్టుకోవ‌ట‌మే కాకుండా సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ర‌విచంద‌ర్ సైతం ట్వీట్స్‌తో అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి ‘దావూదీ’ అనే వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ డాన్స్ గురించి ఆడియెన్స్‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రోసారి ఈ పాట‌లో తార‌క్ డాన్స్ ఎన‌ర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టేశారు. దీంతో ఈ పాట సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా ఉంది. అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్ర‌తీ ఒక్క‌రినీ డాన్స్ చేసేలా చేస్తోంది కానీ.. ఈ పాట వినగానే ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు- మలమ పిత పితా’ని తలపిస్తుండటం గమనార్హం. బహుశా ‘బీస్ట్’ సినిమాకు కూడా అనిరుద్ రవిచందరే సంగీతం అందించడం వల్ల అలా అనిపిస్తుందేమో.. (Devara Daavudi Video Song)


Devara-Movie.jpg

ఇక పాట విషయానికి వస్తే.. ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌గా స్వరపరిచారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాట‌ను త‌మిళంలో విఘ్నేష్ శివ‌న్‌, హిందీలో కౌస‌ర్ మునీర్, క‌న్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ చిక్‌బ‌ల్లాపుర‌, మ‌ల‌యాళంలో మాన్‌కొంబు గోపాల‌కృష్ణ రాశారు. ఈ పాట పాడిన వారి విష‌యానికి వ‌స్తే న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఆల‌పించారు. న‌క‌ష్ అజీజ్‌, ర‌మ్యా బెహ్రా త‌మిళ‌, మ‌ల‌యాళంలో పాట‌ను పాడారు. ఎన్టీఆర్ గ్రేస్, జాన్వీ మైమరపించే అందాలతో వచ్చిన ఈ పాటను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - Sep 04 , 2024 | 05:46 PM

Devara : సూపర్‌ ఎలివేషన్స్‌తో ‘ఫియర్‌’

Devara - Dop Ratnavelu: ఎన్టీఆర్‌ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు..  పూనకాలు పక్కా

Devara Part 1: సైఫ్ అలీఖాన్ ‘భైర‌’ గ్లింప్స్

Devara Part 1: ‘దేవర’ మూవీ ‘ఫియర్’ సాంగ్ ప్రోమో

Devara : సెకెండ్‌ సింగిల్‌..  నీ కోసం వయసు వాకిలి కాసా!