Aay Movie: ‘ఆయ్’ మూవీకి మరోసారి అల్లు అర్జున్ సపోర్ట్..

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:25 PM

‘ఆయ్’ సినిమా విడుదలకు ముందు సపోర్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ చిత్రంగా దూసుకుపోతున్న సందర్భంగా మరోసారి తన అభినందనలు ‘ఆయ్’ టీమ్‌కు అందించారు. ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ించారు.

Aay Movie Team with Allu Arjun

‘ఆయ్’ సినిమా (Aay Movie) విడుదలకు ముందు సపోర్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ఇప్పుడా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ చిత్రంగా దూసుకుపోతున్న సందర్భంగా మరోసారి తన అభినందనలు ‘ఆయ్’ టీమ్‌కు అందించారు. ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. ఆగ‌స్ట్ 15న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణను రాబట్టుకుంటోంది. ఈ సినిమా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అభినందనలను సైతం దక్కించుకుంటోంది.

Also Read- Sanam Shetty: తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను


ఇప్పటికే ఈ సినిమా టీమ్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) అభినందించిన విషయం తెలిసిందే. అలాగే ‘తండేల్’ మూవీ టీమ్ (Thandel Movie Team) నాగచైతన్య, సాయిపల్లవి ఈ చిత్రాన్ని ప్రత్యేక షో ద్వారా వీక్షించి టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు ఐకాన్ స్టార్ వంతొచ్చింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘ఆయ్’ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకుని, సినిమా సాధించిన స‌క్సెస్‌పై ప్ర‌శంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నార్నే నితిన్‌, నిర్మాతలు బ‌న్నీవాస్‌, విద్యా కొప్పినీడి, ద‌ర్శ‌కుడు అంజి కె మ‌ణిపుత్ర‌, హీరోయిన్ న‌య‌న్ సారిక, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. చిన్న సినిమాగా వచ్చి, ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను, అలాగే అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతున్న ఈ చిత్రయూనిట్‌కు అభినందనలు. అలాగే వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాతలు బన్నీవాస్, విద్యలకు.. తొలి చిత్రంతోనే హిట్టుని ఖాతాలో వేసుకున్న దర్శకుడు అంజికి ప్రత్యేకంగా అభినందనలు.. కంగ్రాట్స్ టు టీమ్ ‘ఆయ్’ అంటూ బన్నీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.


‘ఆయ్’ సినిమా విషయానికి వస్తే.. తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్‌తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నామనే ఫీడ్ బ్యాక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చిత్ర టీమ్ తెలుపుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆదరణకు ధన్యవాదాలు అని చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 04:25 PM