Nenu Keerthana: ప్రతిభకు పట్టాభిషేకం చేయడంలో తెలుగువాళ్ల తర్వాతే ఎవరైనా..

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:18 PM

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఈ నెల 30న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను చిత్ర హీరోహీరోయిన్లు ఆదివారం మీడియాకు తెలియజేశారు.

Nenu Keerthana Movie Hero and Heroine

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (Chimata Ramesh Babu)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత (Rishitha) - మేఘన (Meghana) హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ హీరో రమేష్ బాబు అలాగే హీరోయిన్ రిషిత మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Nenu Keerthana Movie Ready to Release)

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

హీరో రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘నేను - కీర్తన’ కథ కోసం ఆరు నెలల పాటు శ్రమించాను. కథ సిద్ధమైన తర్వాత ఈ కథకు దర్శకుడిగా, హీరోగా నేనయితేనే పూర్తి న్యాయం చేయగలనిపించింది. నా నిర్ణయాన్ని అమెరికాలో ఉంటున్న మా సోదరి సమర్ధించి, అన్ని విధాలా సహాయసహకారాలు అందించింది. దర్శకుడుగానూ, హీరోగానూ నాకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. ఈనెల 30న విడుదలవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనడంలో సందేహాలకు తావులేదు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న రిషితకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. అలాగే సెకండ్ హీరోయిన్ మేఘన, స్పెషల్ సాంగ్ చేసిన రేణు ప్రియలకు కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు.. ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెండున్నర గంటలపాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్ చేసే మల్టీ జోనర్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.


Nenu-Keerthina-Movie.jpg

హీరోయిన్ రిషిత మాట్లాడుతూ.. ‘నేను - కీర్తన’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై, సెట్స్‌పై ఉండగానే మరో ఐదు సినిమాలలో నాకు అవకాశం వచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌లో ఎప్పటికీ చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది. హీరో కమ్ డైరెక్టర్ రమేష్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. హీరోయిన్లుగా తెలుగమ్మాయిలకు మన ఇండస్ట్రీలో చోటు లేదనే వాదనను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ప్రతిభ ఉండి పట్టుదలతో ప్రయత్నిస్తే తెలుగమ్మాయిలు కూడా హీరోయిన్లుగా రాణించవచ్చు. ప్రతిభను ప్రోత్సహించడంలో మన తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. ‘నేను కీర్తన’ చిత్రం హీరోయిన్‌గా నా కెరీర్‌కి శుభారంభం ఇస్తుందనే నమ్మకం నాకు ఉందని తెలిపారు. రేణు ప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎల్.రాజా సంగీతం అందించారు.

Read Latest Cinema News

Updated Date - Aug 25 , 2024 | 05:18 PM

Nenu Keerthana: ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రం

Nenu Keerthana: ‘కీర్తన’ పరిచయమయ్యేది ఎప్పుడంటే?

Nenu Keerthana: ‘నేను-కీర్తన’కు మురళీ మోహన్ సపోర్ట్

Nenu Keerthana: ‘సీతా కోకై ఎగిరింది మనసే’ లిరిక‌ల్‌కు అసాధారణ స్పందన

Nenu Keerthana: నేను-కీర్తన టీజర్ కి.. ట్రెమండస్ రెస్పాన్స్‌