Nenu Keerthana: ‘కీర్తన’ పరిచయమయ్యేది ఎప్పుడంటే?

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:47 PM

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నేను కీర్తన’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ప్రచార చిత్రానికి (ట్రైలర్) సోషల్ మీడియాలో వచ్చిన స్పందనకు చిత్రబృందం కూడా హ్యాపీగా ఉంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Nenu Keerthana Movie Still

చిమటా రమేష్ బాబు (Chimata Ramesh Babu) హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నేను కీర్తన’ (Nenu Keerthana). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ప్రచార చిత్రానికి (ట్రైలర్) సోషల్ మీడియాలో వచ్చిన స్పందనకు చిత్రబృందం కూడా హ్యాపీగా ఉంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Nenu Keerthana Ready to Release)

Also Read- Sanam Shetty: తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన ఈ ‘నేను-కీర్తన’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్టీ జోనర్ ఫిల్మ్‌గా తెరకెక్కి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. అలాగే ఎమ్.ఎల్.రాజా (ML Raja) అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ఎస్సెట్ కానుందని మేకర్స్ చెబుతున్నారు.


Nenu-Keerthana-Still.jpg

ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడైన చిమటా రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ట్రైలర్‌‌ (Nenu Keerthana Trailer)కు వస్తున్న స్పందనతో మేమంతా హ్యాపీగా ఉన్నాం. సినిమా విడుదలకు సంబంధించి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్ 30న గ్రాండ్‌గా ‘నేను కీర్తన’ని మీకు పరిచయం చేయబోతున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ని ఈ సినిమాలో జోడించాం. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి.. సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. రేణు ప్రియ, సంధ్య, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 05:16 PM

Nenu Keerthana: నేను-కీర్తన టీజర్ కి.. ట్రెమండస్ రెస్పాన్స్‌

Nenu Keerthana: ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రం

Nenu Keerthana: బ్లాక్ బస్టర్ ఎలిమెంట్స్ అన్నీ.. ఈ చిత్రంలో పుష్క‌లంగా ఉన్నాయి

Nenu Keerthana: ‘నేను-కీర్తన’కు మురళీ మోహన్ సపోర్ట్

Nenu Keerthana: ‘సీతా కోకై ఎగిరింది మనసే’ లిరిక‌ల్‌కు అసాధారణ స్పందన