Peka Medalu: మొగుడికి నువు మొత్తంగా స్వాహా.. అలరిస్తోన్న ఆడపిల్ల సాంగ్

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:01 PM

‘నా పేరు శివ, అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan) హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘పేక మేడలు’. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ‘ఎవరికి చెప్పొద్దు’ సినిమాతో విజయాన్ని అందుకున్న ‘బాహుబలి’ నటుడు రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఆడపిల్ల (హర్ యాంతం) అందరినీ అలరిస్తోంది.

Peka Medalu Movie Stills

‘నా పేరు శివ, అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan) హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘పేక మేడలు’ (Peka Medalu). అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ‘ఎవరికి చెప్పొద్దు’ సినిమాతో విజయాన్ని అందుకున్న ‘బాహుబలి’ నటుడు రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌తో పాటు రీసెంట్‌గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల (హర్ యాంతం)’ను మేకర్స్ విడుదల చేశారు. (Peka Medalu Second Lyrical Song)


‘‘ఆనందం అత్తకు స్వాహా..

మన:శాంతి మామకు స్వాహా

మొగుడికి నువు మొత్తంగా స్వాహా..

ఓయమ్మ.. ఆడదాని జన్మంతా స్వాహా’’ అంటూ సాగిన ఈ పాటకు భార్గవ కార్తీక్ సాహిత్యం అందించగా.. సింగర్ సాకే రాజశేఖర్ ఆలపించారు. స్మరణ్ సాయి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ పాట ఆద్యంతం కొత్తగా, వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని.. సినిమాను జూలై 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు.

Updated Date - Jul 03 , 2024 | 09:01 PM