Pekamedalu: ‘పేక మేడలు’ ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్ లచ్చన్న’ విడుదల

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:47 PM

‘నా పేరు శివ, అంధగారం’ తదితర చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా.. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘పేక మేడలు’. ‘ఎవరికీ చెప్పొద్దు’ బ్యానర్ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నీలగిరి మామిళ్ల రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్ లచ్చన్న’ను మేకర్స్ విడుదల చేశారు.

Pekamedalu: ‘పేక మేడలు’ ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్ లచ్చన్న’ విడుదల
Pekamedalu Movie Stills

‘నా పేరు శివ, అంధగారం’ తదితర చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan) హీరోగా.. అనూష కృష్ణ (Anoosha Krishna) హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘పేక మేడలు’ (Pekamedalu). ‘ఎవరికీ చెప్పొద్దు’ బ్యానర్ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గతంలో ‘పేక మేడలు’ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్ లచ్చన్న’ సాంగ్‌ (Boom Boom Lacchanna Song)ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read-Jackky Bhagnani: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్తకు ఏమైంది.. జీతాలు ఇవ్వడం లేదట!


Boom-Boom-Lacchanna.jpg

‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న’ అంటూ సాగిన ఈ పాటను సింగర్ మనో పాడగా.. భార్గవ్ కార్తీక్ సాహిత్యం అందించారు. స్మరణ్ సాయి అందించిన స్వరాలు వినసొంపుగా ఉండటమే కాకుండా.. ఎట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ పాట ఆద్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా పాటను చూస్తుంటే తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో వస్తోన్న ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని.. సినిమాను జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. కాగా.. నీలగిరి మామిళ్ల రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. (Pekamedalu First Single)

Read Latest Cinema News

Updated Date - Jun 23 , 2024 | 04:47 PM