Good Bad Ugly: అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తాజా అప్డేట్

ABN, Publish Date - Aug 09 , 2024 | 10:01 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ అప్డేట్‌ని ఇచ్చారు.

Ajith Kumar in Good Bad Ugly

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar)తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అజిత్ కుమార్‌ మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపించి.. ఈ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా అప్డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేశారు.

Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్

ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని.. ఈ కీలకమైన షెడ్యూల్‌లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై క్రూషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ అప్డేట్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల బ్లాక్ బస్టర్ ‘మార్క్ ఆంటోని’ (Mark Antony)తో మంచి విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని తెరకెక్కిస్తున్నారు. అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు.


నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతని నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 09 , 2024 | 10:01 PM