Double ismart: ‘క్యా లఫ్డా’.. థర్డ్ సింగిల్ ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:59 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా.. థర్డ్ సింగిల్ ‘క్యా లఫ్డా’‌ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Double ismart Movie Still

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh)ల డెడ్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double ismart). ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్‌ థంపింగ్ రెస్పాన్స్ రాబట్టుకోగా.. సెకెండ్ సింగిల్ ‘మార్ ముంత చోడ్ చింత’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

Also Read- Raayan Review: రాయన్  రివ్యూ.. ధనుష్ 50వ చిత్రం ఎలా ఉందంటే.. 

‘డబుల్ ఇస్మార్ట్’ థర్డ్ సింగిల్ ‘క్యా లఫ్డా’‌ (Double ismart 3rd Single Kya Lafda)ను జూలై 29న రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలుపుతూ.. రామ్, కావ్యా థాపర్ (Kavya Thapar) రొమాంటిక్ కెమిస్ట్రీని వండర్ ఫుల్‌గా ప్రజెంట్ చేస్తోన్న ఓ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్ చాలా ఎట్రాక్టివ్‌గా వుంది. పూరి ఇంతకు ముందు వచ్చిన ‘లైగర్’లోని ‘వాట్ లగా దేంగే’ మాదిరిగా.. ఈ ‘క్యా లఫ్డా’ వర్డ్‌ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో నిలుస్తోంది. పూర్తి సాంగ్ వస్తేకానీ.. దీని సంగతి తెలిసే అవకాశం లేదు. కాబట్టి 29వరకు వెయిట్ చేయాల్సిందే.


Double-Ismart.jpg

పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ బాధ్యతను నిర్వర్తించారు.

Read Latest Cinema News

Updated Date - Jul 26 , 2024 | 09:59 PM

Double Ismart Controversy: దర్శకుడు పూరి జగన్ కి బీఆర్ఎస్ కార్యకర్తల వార్నింగ్ !

Double Ismart Lyrical Song: ఈ పాటలో కెసిఆర్ వాయిస్ విన్నారా!

Double Ismart: మార్ ముంత, చోడ్ చింత పాటలో కెసిఆర్ వాయిస్ పెట్టిన పూరి జగన్ !

Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’.. దద్దరిల్లే అప్‌డేట్

Double ISmart : మాస్‌ మూమెంట్స్‌తో ‘స్టెప్పామార్‌’