Demonte Colony 2: అక్కడ విడుదలైంది.. తెలుగులో ఎప్పుడంటే?

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:43 PM

బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ 2’ తెలుగు విడుదలకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే తమిళ్ విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. తాజాగా తెలుగు వెర్షన్‌కు సంబంధించి విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ నెల 23న రిలీజ్ కాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Demonte Colony 2 Movie Still

బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ 2’ (Demonte Colony 2) తెలుగు విడుదలకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో అరుల్ నిధి (Arulnithi), ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్ మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ నిర్మిస్తున్నాయి. విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. (Demonte Colony 2 Telugu Release Date)

Also Read- Nikhil: ‘కార్తికేయ 2’కు నేషనల్ అవార్డ్.. హీరో నిఖిల్ స్పందనిదే..


‘డీమాంటీ కాలనీ 2’ సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజై మంచి సక్సెస్2ను అందుకున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ‘తంగలాన్’ వంటి పెద్ద సినిమాతో రిలీజై బాక్సాఫీస్ వద్ద పోటీని తట్టుకుని ప్రేక్షకాదరణ పొందిన చిత్రం కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రం టాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్‌ను అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హరర్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఘన విజయాన్ని అందిస్తారని మూవీ టీమ్ ఆశిస్తోంది. ఇప్పటికే తెలుగులో రిలీజైన ‘డీమాంటీ కాలనీ 2’ ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. థియేటర్స్‌లోనూ ఇదే రిజల్ట్‌ వస్తుందని మేకర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ‘డీమాంటీ కాలనీ’ (Demonte Colony) ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా.. మంచి ఆదరణను పొందిన విషయం తెలిసిందే. ఈ పార్ట్ 2 అంతకు మించి భయపెట్టి, ఎంటర్‌టైన్ చేసి పంపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.


తెలుగులో ఈ సినిమా విడుదలకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ సైతం భయపెట్టేలా ఉంది. అందుకే మేకర్స్ ప్రేక్షకులకు కచ్చితం హరర్ థ్రిల్లింగ్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. మరి ‘డీమాంటీ కాలనీ 2’ టీమ్ ఎలా భయపెడతారో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 23 వరకు తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందే.

Read Latest Cinema News

Updated Date - Aug 16 , 2024 | 05:43 PM