మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Miral: భరత్, వాణి భోజన్‌ల హారర్ చిత్రం ‘మిరల్’ ఎప్పుడంటే?

ABN, Publish Date - May 14 , 2024 | 08:44 PM

‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘మిరల్’. ఈ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Miral Movie Stills

‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’ (Miral Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ (Bharath) హీరోగా, వాణి భోజన్ (Vani Bhojan) హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘మిరల్’. ఈ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ (M Sakthivel) దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఎంతగా భయపెట్టిందో తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా ‘మిరల్’ మూవీపై మేకర్స్ భారీగా అంచనాలు పెంచేశారు.

*Ashu Reddy: దేవుడా.. అషు రెడ్డి అంత‌లా పెంచేసిందేంటి?


శ్రీమతి. జగన్మోహిని అండ్ జి ఢిల్లీ బాబు సమర్పణలో రాబోతోన్న ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అవుతుండటం విశేషం. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. (Miral Movie Ready to Release)

Read Latest Cinema News

Updated Date - May 14 , 2024 | 08:44 PM