Committee Kurrollu: 5 రోజుల్లోనే ‘కమిటీ కుర్రోళ్ళు’ కొల్లగొట్టేశారు.. అప్పుడే లాభాల్లోకి!

ABN , Publish Date - Aug 14 , 2024 | 07:10 PM

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్లను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ స్పందనను రాబట్టుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా 5 రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Committee Kurrollu Movie Still

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్లను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ స్పందనను రాబట్టుకుని కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీల నుంచి కూడా అభినంద‌న‌లు అందుకుంటూ ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తన జోరు చూపిస్తోంది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమా రూ. 8.49 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి లాభాల బాటలోకి అడుగు పెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. (Committee Kurrollu Propels into Profit Zone)

Also Read- Jr NTR: రెండు వారాలు విరామం అందుకే.. ఆ ఊహాగానాలు ఆపండి

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాల ప్రశంసలు సైతం దక్కుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Super Star Mahesh Babu)తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar), హీరో నాని (Nani), డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin), డైరెక్ట‌ర్ క్రిష్‌ (Krish), రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) వంటివారంతా ఈ ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సాధించిన స‌క్సెస్‌ను అప్రిషియేట్ చేస్తూ ట్వీట్స్ చేశారు (Celebrities Praises on Committee Kurrollu Movie). ఈ ట్వీట్స్ వైరల్ అవడంతో పాటు.. ఆయా సెలబ్రిటీల అభిమానులు సైతం ఈ సినిమాను చూసేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తుండటం విశేషం.


Niharika-Konidela-Film.jpg

నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ (Yadhu Vamsi) ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేకీవెన్ సాధించింది. ఆగస్ట్ 15న మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న తరుణంలో.. ఇకపై ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.

Read Latest Cinema News

Updated Date - Aug 14 , 2024 | 07:10 PM

Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ లిరికల్ సాంగ్

Committee Kurrollu: నిహారిక‌ ‘కమిటీ కుర్రోళ్ళు’.. జయప్రకాష్ నారాయణ వ‌దిలిన ‘గొర్రెలా..’ పాట

Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ చిన్న సినిమా కాదంటోన్న స్టార్ బాయ్

Committee Kurrollu: ‘సందడి సందడి’ లిరికల్ సాంగ్

Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ వసూళ్లు ఎంతో తెలుసా?