CM Revanth Reddy: ‘భారతీయుడు2’ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:35 PM
‘భారతీయుడు2’ చిత్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు2’. ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న గ్రాండ్‌గా విడుదలకాబోతోంది.
‘భారతీయుడు2’ (Bharateeyudu2) చిత్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు2’. ‘భారతీయుడు’ (Bharateeyudu) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇప్పుడీ సినిమా యూనిట్.. సీఎం రేవంత్ రెడ్డి షరతును పాటించి ఓ వీడియోను విడుదల చేశారు. అందుకుగానూ సీఎం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
Also Read- Siddharth: సిద్ధార్ధ్.. నీ అతి తగ్గించుకుంటే మంచిది..
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సినిమాల విడుదలకు ముందు టికెట్ల ధరలను పెంచాలని మా వద్దకు వచ్చేవారు తప్పని సరిగా డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ వీడియోను చేయాలని షరతు విధించారు. డ్రగ్స్‌పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన ఓ వీడియో గురించి చెబుతూ.. ప్రతి ఒక్కరూ అలా అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని కోరారు. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన ‘భారతీయుడు2’ మీడియా సమావేశంలో ఓ మీడియా పర్సన్ చిత్రయూనిట్‌ని ప్రశ్నించగా.. హీరో సిద్ధార్థ్ కల్పించుకుని.. ‘ఇప్పటి వరకు ఏ సీఎం కూడా మీరు ఇది చేస్తే, మేము అది చేస్తామని చెప్పలేదు’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. కానీ మీడియా సమావేశం అయిన కాసేపటికే తన మిస్టేక్‌ను తెలుసుకుని.. సారీ చెబుతూ, సీఎం రేవంత్ రెడ్డి షరతు తప్పకుండా పాటిస్తామని ప్రకటించారు.
అనంతరం కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని.. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ.. ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ‘‘డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్దతుగా కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ్, సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం. ఈ సినిమా బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. (CM Revanth Reddy Tweet on Bharateeyudu2 Team)
Read Latest Cinema News