Reventh Reddy - TFI: అలా చేయకపోతే ఎలాంటి సహకారం ఉండదు!

ABN , Publish Date - Jul 02 , 2024 | 02:43 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) సినిమా పరిశ్రమకు పలు షరతులు విధించారు. సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌పై సినిమాల్లో అవగాహన కల్పించాలని కండీషన్  పెట్టారు.

Reventh Reddy - TFI: అలా చేయకపోతే ఎలాంటి సహకారం ఉండదు!

టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ దగ్గ‌రికి వ‌చ్చే సినిమా ప్రొడ్యూస‌ర్ కు (producers) తెలంగాణ స‌ర్కార్ కొత్త గైడ్ లైన్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) సినిమా పరిశ్రమకు పలు షరతులు విధించారు. సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌పై సినిమాల్లో అవగాహన కల్పించాలని కండీషన్  పెట్టారు. డ్రగ్స్‌(Drugs), సైబర్‌ నేరాలపై (Cyber crime) థియేటర్లులో ప్రసారం చేయకపోతే థియేటర్లకు అనుమతి ఉండదని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. వందల కోట్ల బడ్జెట్‌ సినిమా అయినా సైబర్‌ క్రైమ్‌, డ్రగ్స్‌పై అవగాహన కల్పించే ప్రకటనలను సినిమాలకు ముందు ప్రదర్శించాలని చెప్పారు.

చిరంజీవిలా డ్ర‌గ్స్ పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిందే...
ఈ మేరకు ఆయన ఏమన్నారంటే "సినిమా టికెట్‌ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడం ప్రయత్నం చేయడంలేదు. అది సినిమా మాధ్యమానికి ఉన్న కనీస బాధ్యత. ఇకపై డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై సినిమాకు ముందుగానీ, తరువాత గానీ 3 నిమిషాల వీడియోతో అవగాహన కల్పించాలి. చిరంజీవి గారిలా డ్ర‌గ్స్ పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిందే. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్‌ రేటు పెంచే ప్రసక్తి లేదు. ఈ షరతులను పట్టించుకోని దర్శనిర్మాతలకు, నటీనటులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు ఉండవు. సినిమా థియేటర్‌ యాజమాన్యాలు కూడా ఇందుకు సహకరించాలి’’ అని ఆయన కోరారు.  

Updated Date - Jul 02 , 2024 | 02:58 PM