Thangalaan: ‘తంగలాన్‌’ నుంచి క్లోజప్ లుక్.. సోషల్‌ మీడియాలో వైరల్‌

ABN, Publish Date - Jun 19 , 2024 | 11:52 AM

చియాన్‌ విక్రమ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’. కోలార్‌ గోల్డ్‌ ఫ్యాక్టరీ (కేజీఎఫ్‌) పని చేసిన తమిళ కూలీల ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు పా.రంజిత్‌. మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు హీరోయిన్లు. ప్రతి నాయకుడిగా పశుపతి నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదల చేసిన విక్రమ్ క్లోజప్ లుక్ సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

Chiyaan Vikram in Thangalaan

చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) తాజాగా నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). కోలార్‌ గోల్డ్‌ ఫ్యాక్టరీ (కేజీఎఫ్‌) పని చేసిన తమిళ కూలీల ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు పా.రంజిత్‌. మాళవిక మోహనన్‌ (Malavika Mohanan), పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu) హీరోయిన్లు. ప్రతి నాయకుడిగా పశుపతి నటించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ యేడాది జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, పోస్ట్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ పనులు పూర్తి కాకపోవడంతో చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి విక్రమ్‌ కొత్త లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేయగా అది వైరల్‌గా మారింది.

Also Read- Vijay: విజయ్‌ పార్టీలో చేరనున్న ఆ ఇద్దరు నటులు?

ఈ లుక్‌లో విక్రమ్‌ని చాలా క్లోజ్‌గా చూపించారు. కళ్లలో కళ్లు పెట్టి తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పిక్.. విక్రమ్‌లోని విలక్షణతని మరోసారి తెలియజేస్తోంది. స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీని ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా అనేక అవార్డులు, రివార్డులు వరించడం విశేషం. మూవీ క్రిటిక్స్‌ నుంచి సైతం ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆగస్టులో విడుదలయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (Chiyaan Vikram New Look)


ఇటీవల ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ.. ‘తంగలాన్’ సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్‌తో పాటు మూవీ టీమ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ జియో స్టూడియోస్ ఈ సినిమా కోసం స్టూడియో గ్రీన్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్‌కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. హీరో విక్రమ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం ఏంటో రేపు సినిమా చూసిన అందరికీ తెలుస్తుందని అన్నారు. (Thangalaan Movie)

Read Latest Cinema News

Updated Date - Jun 19 , 2024 | 11:52 AM