Akhanda 2: బాలయ్య, బోయపాటి BB4 టైటిల్ పోస్టర్ వదిలారు

ABN, Publish Date - Oct 16 , 2024 | 08:44 AM

ఇండియన్ సినిమాలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరోసారి చేతులు కలిపారు. హ్యాట్రిక్ సక్సెస్‌ల తర్వాత వారి నుండి రాబోతోన్న నాల్గవ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఆ వివరాల్లోకి వెళితే..

Akhanda 2 Title Look

ఇండియన్ సినిమాలో అత్యంత క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (God Of Masses Nandamuri Balakrishna) మరియు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) మరోసారి చేతులు కలిపారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్- ‘సింహ, లెజెండ్ మరియు అఖండ’ చిత్రాల తర్వాత నాల్గవసారి వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి చిత్రం ఒకదానిని మించి మరొకటి బాలయ్యకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా వీరి నుండి వచ్చిన చివరి చిత్రం ‘అఖండ’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలయ్యాయంటే ఏ రేంజ్‌లో ఆ సినిమా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న నాల్గవ చిత్రం నేడు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది. ఇదే సందర్భంలో చిత్ర టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇది ‘అఖండ’‌ (Akhanda)కు సీక్వెల్ అని తెలుపుతూ.. ‘అఖండ 2’ (Akhanda 2) టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Sai Durgha Tej: మేనమామ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు వచ్చేశాయ్


బాలయ్య కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది బాలకృష్ణ మరియు బోయపాటి ఇద్దరికీ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. ‘అఖండ’తో తాండవం ఆడేసిన బాలయ్య ఈ ‘అఖండ 2’తో మరోసారి తన సత్తా చాటబోతున్నాడనే విషయం అద్భుతంగా డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్టర్ తెలియజేస్తోంది. ఈ పోస్టర్ ఆధ్యాత్మిక అంశాలతో డిజైన్ చేశారు. టైటిల్ స్ఫటిక లింగంతో దైవికత ఉట్టిపడేలా ఉండగా.. శక్తివంతమైన క్యాప్షన్‌ ‘తాండవం’ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ తాండవానికి రెండు డమరుకంలు చుట్టబడి ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో గంభీరమైన హిమాలయాలను గమనించవచ్చు. (Akhanda 2 Title Poster)


నటసింహం బాలకృష్ణ (Natasimham Balakrishna)ను లార్జర్ దేన్-లైఫ్ క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేయడంలో బోయపాటికి మించిన వారు లేరనేది కాదనలేని సత్యం. దర్శకుడు బోయపాటి మరోసారి బాలయ్యని కమాండింగ్ పాత్రలో చూపించడానికి యూనివర్సల్ అప్పీల్‌తో శక్తివంతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. వారిద్దరి కెరీర్‌లోనే ‘అఖండ 2’ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా, భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కబోతోంది. ‘అఖండ’ చిత్రానికి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ సీక్వెల్‌కి కూడా పని చేయనున్నారు. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2024 | 08:44 AM