మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Average Student Nani: అయ్యబాబోయ్.. ఆ ఫస్ట్ లుక్ ఏంటి?

ABN, Publish Date - May 17 , 2024 | 08:43 PM

‘మెరిసే మెరిసే’ చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ కొత్తూరి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

Average Student Nani Movie Still

‘మెరిసే మెరిసే’ చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar K) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani) అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ కొత్తూరి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. (Average Student Nani First Look)

*Devara Part 1: ‘దేవర’ మూవీ ‘ఫియర్’ సాంగ్ ప్రోమో


ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా అయ్యబాబోయ్ అనాల్సిందే. అంత బోల్డ్‌గా ఉంది మరి. సినిమా టైటిల్ చాలా సాఫ్ట్‌గా ఉన్నా.. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే మాత్రం.. డైరెక్టర్ తేజ చిత్రంలోని ‘ఏకాంతవేళ’ పాట గుర్తుకు రాకుండా ఉండదు. అలా డిజైన్ చేశారీ ఫస్ట్ లుక్‌ని. ఈ బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో అర్థమవుతోంది. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు ఇందులో హీరోయిన్లుగా నటించారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి (Sri Neelakanta Mahadeva Entertainments LLP) బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం, ఉద్ధవ్ ఎస్ బి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 12:45 PM