N. T. Rama Rao : యముడి మీద నరుడు గెలవడం తమాషా
ABN , Publish Date - May 17 , 2024 | 06:07 PM
ఒక సినిమాలో అయన యముడు. మరో చిత్రంలో ఆ యముడిని ఆట పట్టించే నరుడు. ఇలా ఒకే సమయంలో రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఎన్టీఆర్ కు లభించింది.
ఒక సినిమాలో అయన యముడు. మరో చిత్రంలో ఆ యముడిని ఆట పట్టించే నరుడు. ఇలా ఒకే సమయంలో రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఎన్టీఆర్ (NT Ramarao)కు లభించింది. ఆ సినిమాలు 'సతీ సావిత్రి', 'యమగోల' (Yamagola). ఈ చిత్రం లో ఎన్టీఆర్ పాత్ర పేరు సత్యం. ఆయనకు జంటగా నటించిన జయప్రద పేరు సావిత్రి. వారిద్దరి ప్రేమ కధ.
ఇంతలోనే యముడు, చిత్రగుప్తుడు భూ లోకానికి రావడం, సత్యాన్ని తమతో తీసుకు వెళ్లాలని చూడడం, తెలివిగా యమధర్మరాజుని మాయ చేసి సత్యం భూలోకంలోనే ఉండేలా వరం పొందడం యమగోల కధ. ఇలా యమగోలలో సత్యవంతుడిని పోలిన పాత్రను పోషించిన ఎన్టీఆర్ 'సతీ సావిత్రి'లో (Sati Savitri) యముడుగా నటించడం అప్పట్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
వీటిల్లో యమగోల చిత్రం 1977 విజయదశమికి, మూడు నెలల గ్యాప్ తో 'సతీ సావిత్రి' 1978 సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యాయి. 1978 ఫిబ్రవరి 22 నాటికీ 'యమగోల' 125 రోజులు, 'సతీ సావిత్రి' 50 రోజులు పూర్తి చేసుకున్నాయి .ఈ పోటీలో యముడి మీద నరుడు గెలవడం తమాషా .
- వినాయకరావు