Shivam Bhaje: న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘శివం భజే’ రిలీజ్ డేట్ ఫిక్సయింది..

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:49 PM

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘శివం భజే’. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అప్సర్ దర్శకత్వంలో నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్ర విడుదల తేదీని శుక్రవారం మేకర్స్ ప్రకటించారు.

Shivam Bhaje Movie Still

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘శివం భజే’ (Shivam Bhaje). గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అప్సర్ (Director Apsar) దర్శకత్వంలో నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి (Producer Maheswara Reddy Mooli) నిర్మిస్తున్నారు. అశ్విన్ బాబు (Ashwin Babu), దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 1న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘శివం భజే’ చిత్రాన్ని ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నాం. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. ఇది మా సంస్థ నుంచి వస్తోన్న మొదటి చిత్రం. అందరి సహకారంతో అంతా అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ అన్ని వర్గాల, వయసుల ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది మా ‘శివం భజే’. టైటిల్, టీజర్‌తో అందరి దృష్టి ఆకర్షించిన మా చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. మా హీరో అశ్విన్ బాబు, ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత మహేశ్వర రెడ్డి పూర్తి సహకారంతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందింది. పాటల్ని అలాగే ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. (Shivam Bhaje Release Date)


Shivam-Bhaje.jpg

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. దర్శకుడు అప్సర్ వైవిధ్యమైన కథకి తగ్గట్టుగా కావాల్సిన సాంకేతిక విలువలు, నిపుణుల విషయంలో ఖర్చుకి వెనకాడకుండా మా నిర్మాత మహేశ్వర రెడ్డి అందించిన సహకారం.. అలాగే ప్రతీ ఒక్కరూ తమ కెరీర్ బెస్ట్ ఇవ్వడంతో ఈ చిత్రం మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. టీజర్‌కి వచ్చిన అనూహ్య స్పందనకి మా అందరి విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ఆగస్ట్ 1న వస్తున్న ఈ చిత్రాన్ని అంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 12 , 2024 | 05:49 PM

Shivam Bhaje: ‘శివం భజే’ ఫస్ట్ లుక్.. ఊర మాస్!

Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా కొత్త చిత్రం.. టైటిల్‌తోనే అద‌ర‌గొట్టాడుగా

Shivam Bhaje: మ‌రో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌తో అశ్విన్‌.. రేపు 'శివం భజే' టీజర్

Shivam Bhaje: రుద్ర తాండ‌వం మొద‌లు.. అశ్విన్ 'శివం భజే' టీజర్ విడుదల

Shivam Bhaje: ‘శివం భజే’ మూవీ టీజర్