Shivam Bhaje: మ‌రో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌తో అశ్విన్‌.. రేపు 'శివం భజే' టీజర్

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:58 PM

హిడింబా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత అశ్విన్ బాబు హీరోగా, దిగాంగనా సూర్యవంశీ హీరోయిన్ గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శివం భజే. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Shivam Bhaje: మ‌రో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌తో అశ్విన్‌.. రేపు 'శివం భజే' టీజర్
ashwin babu

గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'శివం భజే (Shivam Bhaje). అశ్విన్ బాబు (Ashwin Babu) హీరోగా, దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi) హీరోయిన్ గా అప్సర్ (Apsar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది.

GQWrBP8bYAA7NIs.jpeg


తాజాగా రిలీజ్ చేసిన అశ్విన్ లుక్ అదిరిపోయింది. ఉగ్ర రూపంలో ఉన్న అశ్విన్ ఓ వైపు శివస్మరణతో టైటిల్, బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర ఇలా అనౌన్స్ చేసిన ప్రతీ అప్డేట్ కి పెరిగిపోతున్న అంచనాలు దృష్టిలో ఉంచుకుని నిర్మాత రేపు సాయంత్రం 4:05 గంటలకి టీజర్ విడుదల చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న‌ ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 09:38 PM