మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Antheema Theerpu: కత్తి పట్టిన సాయి ధన్సిక.. ‘అంతిమ తీర్పు’ ఎప్పుడంటే?

ABN, Publish Date - Jun 13 , 2024 | 07:13 PM

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంతిమ తీర్పు’. ఏ. అభిరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి. రాజేశ్వరరావు నిర్మించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. సాయి ధన్సిక గృహిణిగా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Sai Dhanshika

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి ధన్సిక (Sai Dhanshika), అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అంతిమ తీర్పు’ (Antheema Theerpu). ఏ. అభిరాము (A Abhiramu) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డి. రాజేశ్వరరావు (D Rajeswara Rao) నిర్మించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. సాయి ధన్సిక గృహిణిగా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. సీనియర్ సంగీత దర్శకుడు కోటి (Koti) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం

ఈ సందర్భంగా నిర్మాత డి.రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘అంతిమ తీర్పు’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సినిమాను జూన్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. సాయి ధన్సిక నటన సినిమాకు మెయిన్ హైలెట్ కానుంది. అలాగే సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటలు, నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్. జూన్ 21న అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. (Antheema Theerpu Release Date)


ఇక ఈ చిత్ర విడుదల తేదీని తెలుపుతూ విడుదల చేసిన ఫొటోలలో సాయి ధన్సిక పవర్‌ఫుల్ లేడీగా కనిపిస్తోంది. కత్తి పట్టి కదనరంగంలోకి వెళుతున్న మహిళగా నడిచి వస్తోన్న ఆమె ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాపై సాయి ధన్సిక ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. (Antheema Theerpu Ready to Release)

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 07:13 PM