Prabhas: టీ సిరీస్‌తో మరోసారి.. దర్శకుడు ఎవరంటే!

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:47 PM

'బాహుబలితో ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన పాన్  ఇండియానే కాదు.. పాన్  వరల్డ్‌ స్టార్ గా  గుర్తింపు తెచ్చుకున్నారు.   బాలీవుడ్‌ నిర్మాణ (Bollywood movie) సంస్థలు ప్రభాస తో సినిమాలు  చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

Prabhas: టీ సిరీస్‌తో మరోసారి.. దర్శకుడు ఎవరంటే!

'బాహుబలితో ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన పాన్  ఇండియానే కాదు.. పాన్  వరల్డ్‌ స్టార్ గా  గుర్తింపు తెచ్చుకున్నారు.   బాలీవుడ్‌ నిర్మాణ (Bollywood movie) సంస్థలు ప్రభాస తో సినిమాలు  చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. టీ సిరీస్‌ సంస్థ ఇప్పటికే ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’ నిర్మించింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టి నష్టాలు చవిచూసింది. అయితే టీ సిరీస్‌కి మాత్రం ఇది ఫ్రాపిట్‌ ప్రాజెక్ట్‌. ఇప్పుడు ప్రభాస్‌తో మరో సినిమా చేయడానికి టీ సిరీస్‌ ముందుకొచ్చింది. అందుకోసం ప్రభాస్‌కు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చినట్టు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. టీ సిరీస్‌ ఆధ్వర్యంలో కొంతమంది దర్శకులు ప్రభాస్‌ కోసం కథలు సిద్థం చేస్తున్నారు. ఈ లిస్టులో సిద్దార్థ్‌ ఆనంద్‌ పేరు బాగా వినిపిస్తోంది. ‘వార్‌’ చిత్రం తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయాలని సిద్దార్థ్‌ ప్లాన్  చేశాడు. అందుకు ఎంతో శ్రమించాడు. పలు కథలు ఇప్పటికే సిద్ధం చేశాడు. 

ప్రభాస్‌ కూడా  సిద్దార్థ్‌ ఆనంద్‌తో (Siddartha anandh)పని చేయడానికి ఉత్సాహం చూపించాడు. కానీ ఇద్దరి కమిట్‌మెంట్స్‌ వల కుదర్లేదు. ఇప్పుడు టీ సిరీస్‌ మళ్లీ ప్రభాస్‌ - సిద్దార్థ్‌లను కలిపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌కు కి సరిపడ కథ సిద్దార్ద్‌ దగ్గర ఉంది కాబట్టి, ఈ కాంబోని ఈజీగా పట్టాలెక్కించవచ్చని టీ సిరీస్‌ ప్లాన్‌ చేస్తోంది. కానీ ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తనుకు గ్యాప్‌ కుదరాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకూ సిద్దార్థ్‌ ఆగాల్సిందే! ఈలోగా మరో దర్శకుడు ప్రభాస్‌లోకి టచ్‌లోకి వెళ్తే, ఆ సినిమాని టీ సిరీస్‌లో చేసే అవకాశం కూడా ఉంది. టీ సిరీస్‌తో సినిమా మాత్రం పక్కా. దర్శకుడు ఎవరన్నది ప్రభాస్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టాక్‌. 

Updated Date - Jun 13 , 2024 | 04:51 PM