Bachhala Malli: డబ్బింగ్‌లో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’
ABN, Publish Date - Jul 07 , 2024 | 10:32 PM
హీరో అల్లరి నరేష్ నటిస్తోన్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఇందులో ఆయన ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లుగా మేకర్స్ తెలిపారు.
హీరో అల్లరి నరేష్ (Allari Naresh) నటిస్తోన్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). ఇందులో ఆయన ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా అల్లరి నరేష్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేసిన బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా తాజాగా మేకర్స్ ఈ చిత్ర అప్డేట్‌ని మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైనట్లుగా మేకర్స్ ప్రకటించారు. (Bachhala Malli in Dubbing)
Read Also- Lavanya and Raj Tarun Case: మాల్వీపై మోజుతో.. నన్ను వదిలించుకోవడానికే ఇవన్నీ!
‘బచ్చల మల్లి’లో అల్లరి నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనేది.. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ చూస్తేనే అర్థమైంది. డైరెక్టర్ సుబ్బు (Subbu Mangadevi), నరేష్‌ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Latest Cinema News