Bachhala Malli: ‘ఏయ్ ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’.. అదిరిన అల్ల‌రి న‌రేశ్ గ్లింప్స్‌

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:18 PM

అల్లరి నరేష్ అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నకొత్త చిత్రం బచ్చల మల్లి. ఈ రోజు అల్ల‌రి న‌రేశ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న క్యారెక్ట‌ర్‌ను పరిచ‌యం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Bachhala Malli: ‘ఏయ్ ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’.. అదిరిన అల్ల‌రి న‌రేశ్ గ్లింప్స్‌
allari naresh

అల్లరి నరేష్ (Allari Naresh), అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నకొత్త చిత్రం బచ్చల మల్లి(Bachhala Malli). ఈ రోజు అల్ల‌రి న‌రేశ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న క్యారెక్ట‌ర్‌ను పరిచ‌యం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి (Subbu Mangadevi) దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌పై రాజేష్ దండా (Razesh Danda), బాలాజీ గుత్తా (Balaji Gutta) చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

GRTJDIGaAAA62Mb.jpeg

ఈ గ్లింప్స్‌ను ప‌రిశీలిస్తే.. హీరో ఇంటి దగ్గర లౌడ్ స్పీకర్‌లో భగవద్గీత వినిపించ‌డంతో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది, అది హీరో నిద్రకు భంగం కలిగిస్తుందని మైక్ సెట్‌ను తీసి నేల‌కోసి కొడ‌తాడు తర్వాత లోకల్ బార్‌లో స్టైల్‌గా మందు తాగుతూ అక్కడి వారితో ఫైట్ చేసి ఎపిసోడ్ అదిరిపోయింది. “ఏయ్ ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి' అంటూ అల్లరి నరేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ క్యారెక్టర్‌ను తెలియ‌జేస్తోంది. మొత్తంగా గ్లింప్స్ అల్లరి నరేష్ ఇంతకు ముందెన్న‌డు క‌నిపించ‌ని మాస్ క్యారెక్టర్‌లో మాస్ అప్పీల్‌తో అదిరిపోయింది.


GRTPnPybEAEJXrY.jpeg

ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ మూవీకి ద‌ర్శ‌కుడు సుబ్బునే స్వయంగా కథ, సంభాషణలు అందిస్తుండ‌గా విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.

GRTPmp6aAAACRyl.jpeg

'సీతా రామం' చిత్రానికి సంగీతం అందించిన‌ విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekar) సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తీ వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు. సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Updated Date - Jun 30 , 2024 | 12:18 PM