VenkyAnil3: పొల్లాచ్చిలో ఐశ్వర్యతో పాటేసుకుంటోన్న వెంకీ..

ABN , Publish Date - Aug 25 , 2024 | 08:42 PM

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. పొల్లాచ్చిలో వెంకీ, ఐశ్వర్యలపై ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

VenkyAnil3 Film Onlocation

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌లో తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. పొల్లాచ్చి (Pollachi)లోని కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌లు పోషించిన భార్య, భర్తల పాత్రలపై ఒక అందమైన పాట చిత్రీకరించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం అందించగా.. భాస్కరభట్ల (Bhaskarabhatla) సాహిత్యాన్ని సమకూర్చారు. డ్యాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటి కానుందని, తెరపై చూసేప్పుడు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.., ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) అతని భార్యగా నటిస్తోంది. మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా ఇందులో ఇంకో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ త్రికోణ క్రైమ్ డ్రామాలో వెంకీ మాజీ ప్రేయసిగా ఆమె కనిపించనుందని తెలుస్తోంది.


Venky-Aishwarya.jpg

ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేకు సహకరించారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి (Sankranthi Release)కి థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 25 , 2024 | 08:42 PM

Venky Anil3: 'యానిమల్‌’ నటుడిని పట్టేశారు!

VenkyAnil3: అనిల్ రావిపూడి సినిమా షూట్‌లో అడుగెట్టిన వెంకీమామ..

VenkyAnil3: వెంకీ, అనిల్ రావిపూడి చిత్రానికి క్లాప్ పడింది.. కాన్సెప్ట్ ఇదే!

Anil Ravipudi: 'ఎఫ్‌4' కాదు.. ఆ మాటలు నమ్మవద్దు!

Aishwarya Rajesh: అయ్యబాబోయ్.. ఐశ్వర్య కూడా స్టార్ట్ చేసిందిగా..!