VenkyAnil3: వెంకీ, అనిల్ రావిపూడి చిత్రానికి క్లాప్ పడింది.. కాన్సెప్ట్ ఇదే!

ABN , Publish Date - Jul 03 , 2024 | 06:16 PM

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం. 58 చిత్రం గ్రాండ్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు హిలేరియస్ హిట్స్- F2, F3 తర్వాత వారు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కోసం వారిద్దరూ మరోసారి చేతులు కలిపారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమైంది.

VenkyAnil3 Movie Launch

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ప్రొడక్షన్ నెం. 58 చిత్రం గ్రాండ్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు హిలేరియస్ హిట్స్- F2, F3 తర్వాత వారు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కోసం వారిద్దరూ మరోసారి చేతులు కలిపారు. దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలనంతరం ముహూర్తం షాట్‌కు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేయగా.. లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

VenkyAnil2.jpg

ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే.. హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ, అనిల్, ఎస్‌విసి కాంబోలో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్స్ వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడీ కాంబినేషన్‌లో మరో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. (VenkyAnil3 Movie Launch)


VenkyAnil3.jpg

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. (SVC58)

VenkyAnil1.jpg

Updated Date - Jul 03 , 2024 | 07:12 PM