'అర్జున ఫల్గుణ': షూటింగ్ పూర్తి చేసిన శ్రీవిష్ణు
ABN , First Publish Date - 2021-10-05T19:03:42+05:30 IST
యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున ఫల్గుణ'. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అర్జున ఫల్గుణ'. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్ కుమార్ కసిరెడ్డి - మహేష్ ఆచంట ఇతర పాత్రలు పోషించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా 'ఇక అర్జునుడి సమయం మొదలు అంటూ' అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు.