Sreeleela: 'కిస్సిక్' డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడుతుంది.. శ్రీలీల

ABN, Publish Date - Jan 02 , 2025 | 08:17 PM

Sreeleela: సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు సెన్సాఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువే. తాజాగా ఆమె మీడియాని హ్యాండిల్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ శ్రీలీల ఏం చేసిందంటే..

sreeleela performing kissik song

రైజింగ్ బ్యూటీ శ్రీలీల కేవలం తెలుగు స్టేట్స్‌లోనే కాకుండా పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే సెన్సేషనల్ డ్యాన్స్ స్టెప్స్ తో టాలీవుడ్ ని షేక్ చేసిన శ్రీలీల తర్వాత వరుస ప్లాప్‌లతో కాస్త నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' కిస్సిక్ సాంగ్ తో తిరిగి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఆమె ఎక్కడ కనపడిన అభిమానులు, మీడియా కెమెరాలను 'కిస్సిక్'మనిపిస్తునారు. తాజాగా ఆమె తన తల్లితో కలిసి ఓ ఎయిర్ పోర్టులో సందడి చేసింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ శ్రీలీల ఏం మాట్లాడింది అంటే..


శ్రీలీల తన మదర్ తో ఎయిర్ పోర్టులో కనిపించగానే మీడియా ఫోటోలోకు పోజ్ ఇయ్యమని 'పుష్ప 2' భాషలో కిస్సిక్ ప్లీజ్ అని అడిగారు. అలాగే కిస్సిక్ స్టెప్స్ చేయాలని కోరారు. దీనికి బదులుగా ఆమె 'పుష్ప 2' కిస్సిక్ స్టైల్ లోనే డ్యాన్స్ చేస్తే అమ్మ దెబ్బలు కొడుతుందని తన సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శించారు.


ప్రస్తుతం ఆమె సిద్దు జొన్నలగడ్డ, రవితేజలతో సితార బ్యానర్ లో రెండు సినిమాలు సైన్ చేశారు. అఖిల్ అక్కినేనితో మరో సినిమాని ఆమె సితార బ్యానర్ లో సైన్ చేశారు. ఈ సినిమాకి వినరో భాగ్యము విష్ణుకథ సినిమా డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని సితారతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీలే యాక్ట్ చేయనుంది. ఏది ఏమైన 'కిస్సిక్' సాంగ్ తో శ్రీలీల కెరీర్ లో మళ్ళీ జోష్ పెరిగింది.

Updated Date - Jan 02 , 2025 | 08:23 PM