Ram Charan: ‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పై రామ్ చరణ్ అన్‌ప్రిడక్టబుల్ రెస్పాన్స్
ABN, Publish Date - Jan 14 , 2025 | 06:08 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా జనవరి 10న విడుదలై.. సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ ప్రచారం నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ తన పాత్రని ఉద్దేశిస్తూ.. ‘ఐ మాయ్ అన్‌ప్రిడక్టబుల్’ అన్నట్లుగానే.. ఆ సినిమా రిజల్ట్‌పై కూడా రామ్ చరణ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అన్‌ప్రిడక్టబుల్‌గా రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన స్పందన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై కావాలని కొందరు నెగిటివ్ ప్రచారాన్ని స్ర్పెడ్ చేయడంతో పాటు.. పైరసీ కూడా చేసి హెచ్‌డి ప్రింట్‌ని ఆన్‌లైన్‌లో వదిలారు. దీనిపై దిల్ రాజు అండ్ టీమ్ సీరియస్‌గా రియాక్ట్ అవడమే కాకుండా.. దీనికా కారణమైన దాదాపు 45 మంది ఇతర హీరోల ఫ్యాన్స్ వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులకు రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారంటే సెన్సేషనల్ కాకుండా ఎలా ఉంటుంది.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా రామ్ చరణ్ ఓ లేఖను పోస్ట్ చేశారు. ఈ లేఖలో పాజిటివ్ ఎనర్జీతో 2025లోకి అడుగు పెట్టిన సందర్భంగా అందరికీ ఓ ప్రామిస్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. నా ప్రియమైన అభిమానులకు, ప్రేక్షకులకు, మీడియా వారికి అంటూ మొదలు పెట్టిన రామ్ చరణ్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, ఆ తర్వాత గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి మాట్లాడారు.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
‘‘ఈ సంక్రాంతికి, గేమ్ చేంజర్ రూపంలో మా కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. నా ఈ మైల్ స్టోన్‌లో కీలకమైన పాత్ర పోషించి, గేమ్ చేంజర్‌కు మంచి రివ్యూలు ఇచ్చి ఎంకరేజ్ చేసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు. ఈ సక్సెస్‌తో 2025లోకి పాజిటివ్ ఎనర్జీతో అడుగు పెట్టిన సందర్భంగా ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఇకపై కూడా మీరందరూ గర్వపడే విధంగా ప్రదర్శనను కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ‘గేమ్ చేంజర్’ సినిమాకు నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన శంకర్‌గారికి ధన్యవాదాలు. నాపై మీరంతా చూపిస్తున్న ఎంతో విలువైన ప్రేమకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను..’’ అని రామ్ చరణ్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.