Daaku Maharaaj: అయ్యబాబోయ్.. ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ టాక్ ఇలా ఉందేంటి?

ABN, Publish Date - Jan 12 , 2025 | 08:34 AM

నందమూరి నటసింహం బాలయ్య ‘డాకు మహారాజ్’గా థియేటర్లలోకి దిగేశారు. ఆల్రెడీ కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షో స్ పూర్తయ్యాయి. ‘డాకు మహారాజ్’ టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన కొందరు నెటిజన్లు.. ట్విట్టర్ ఎక్స్ వేదికగా తమ రివ్యూ ఇస్తున్నారు. పస్తుతం ఈ సినిమాకు ట్విట్టర్‌ ఎక్స్‌లో టాక్, రివ్యూస్ ఎలా ఉన్నాయంటే..

Daaku Maharaaj X Review

నందమూరి నటసింహం బాలయ్యకు, ఆయన అభిమానులకు సంక్రాంతి అంటే పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే, బాలయ్య సంక్రాంతి ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఈ సంక్రాంతికి మాస్ ఎలివేషన్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ బాబీ‌తో కలిసి ఆయన థియేటర్లలోకి దిగితే.. మాస్ సంభవం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో తెలియని విషయం అయితే కానే కాదు. ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్, ట్రైలర్స్.. అందులో బాలయ్య కనిపించిన తీరు, మరోసారి థమన్ అనే ట్యాగ్.. వీటన్నింటికీ మించి బాలయ్యని అభిమానించే వీరాభిమాని నిర్మించిన సినిమా కావడంతో.. మొదటి నుంచి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోనూ సంక్రాంతి బరిలో ఉండటం.. ఇంకేం కావాలి నందమూరి అభిమానులకి. ఇక థియేటర్లలోకి దూకేయడమే. ఆల్రెడీ కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షో స్ పూర్తయ్యాయి. టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన వారిలో కొందరు ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. మరి ఆ రివ్యూలలో ‘డాకు మహారాజ్’ పరిస్థితి ఏంటో చూద్దామా..


‘‘హిట్ బొమ్మ. టాప్ క్లాస్ విజువల్స్, టాప్ క్లాస్ బిజీఎమ్, టాప్ క్లాస్ యాక్షన్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా పని చేశారు. బాలయ్య, పాప ఇరగదీశారు. మ్యూజిక్ థమన్‌కు బాలయ్య ఫ్యాన్స్ గుడి కట్టేయవచ్చు. డైరెక్టర్ బాబీ తన జాబ్‌ని అద్భుతంగా నిర్వర్తించాడు..’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


‘‘డాకు మహారాజ్ మూవీ సెకండాఫ్‌లోని ఓ పాయింట్ వరకు స్టైలిష్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది. ఆ పాయింట్ నుండి ఊహించదగిన సినిమాగా మారి.. బాగా ల్యాగ్ అనిపిస్తుంది. సాంకేతికంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. మాస్ ఎలివేషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. బాలయ్య, థమన్ కాంబో మరోసారి మాస్ ట్రీట్ ఇచ్చేసింది. దర్శకుడు మాస్ ఎలిమెంట్స్‌తో బాలయ్యని ప్రజంట్ చేశారు. అయినప్పటికీ, సెకండాఫ్‌లో వచ్చే ఒక పాయింట్ తర్వాత సినిమా స్వరూపం మారిపోతుంది. చివరి 30 నిమిషాలు కాస్త పరీక్ష పెడతాయి. మొత్తంగా అయితే చూడదగిన సినిమాగా ఈ సినిమా ముగుస్తుంది..’’ అని ఓ నెటిజన్ తన ట్వీట్‌లో 2.75 రేటింగ్‌తో రివ్యూ ఇచ్చారు.

Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’కి షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం


‘డాకు మహారాజ్’ పాజిటివ్ డీసెంట్‌గా ఉంది. ఈ సినిమాకు పాజిటివ్స్- థమన్ బిజీఎమ్, బాలయ్య, సాలిడ్ ఎలివేషన్స్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అయితే.. నెగిటివ్స్- ఊహించదగిన స్టోరీ, అండర్‌రిటెన్ క్యారెక్టర్స్, కొన్ని ఆకట్టుకోని మరియు మళ్లీ మళ్లీ వచ్చే సన్నివేశాలు, వీక్ క్లైమాక్స్. మొత్తంగా ఫ్యాన్ మూమెంట్స్‌తో వచ్చిన యాక్షన్ అండ్ డీసెంట్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’ అని ఓ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ అయింది.


చాలా తక్కువ అంచనాలతో ఈ సినిమాకు చూడడానికి వెళ్లి.. ఫిల్మ్ క్వాలిటీ చూసి సూపర్ సర్‌ప్రైజ్ అయ్యాను. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సాంకేతికంగా ఈ సినిమా బలంగా ఉంది. నటీనటులు బాగా కుదిరారు. కాకపోతే రొటీన్ స్టోరీ. కానీ ఎలివేషన్స్ అదిరాయి. బాలయ్య బాబు టెర్రిఫిక్. స్క్రీన్ ప్రెజన్స్‌తో మంట పుట్టించాడు. థమన్ అన్న ఊరమాస్ ర్యాంపేజ్. సినిమాటోగ్రఫీ అద్భుతం. ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ మాత్రం రొటీన్. పాత సీసాలో పాత సారా అన్నట్లుగా ఉంది కానీ.. కలర్‌ఫుల్‌గా చెక్కబడింది’’ అని ఓ నెటిజన్ తన రివ్యూ ఇచ్చాడు.


మొత్తంగా అయితే.. ఇప్పటి వరకు ట్విట్టర్ ఎక్స్‌లో వినిపిస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ మాత్రం బాగా ల్యాగ్ అనేలా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్ అనేలా నెటిజన్లు రిపోర్ట్ ఇస్తున్నారు. బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఈ సినిమాపై బాగా ప్లస్ అయ్యాయనేలా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో..

Also Read-Mega Vs Allu: ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు..

Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 09:01 AM