Mahesh - Rajamouli: ఇద్దరూ సెంటిమెంట్‌ బ్రేక్‌ చేశారు..

ABN, Publish Date - Jan 03 , 2025 | 02:32 PM

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుకి (Mahesh Babu) చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. సినిమా ప్రారంభోత్సవం రోజున మహేష్‌ పూజా కార్యక్రమానికి వెళ్లరు.

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుకి (Mahesh Babu) చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. సినిమా ప్రారంభోత్సవం రోజున మహేష్‌ పూజా కార్యక్రమానికి వెళ్లరు. ఆయనకున్న సెంటిమెంట్స్‌లో ఇదొకటి. నేరుగా షూటింగ్‌కే వెళ్తారు. దాదాపు పదిహేనేళ్లుగా ఇదే జరుగుతోంది. మహేష్‌ లేకుండానే పూజా కార్యక్రమాలు నిర్వహించి క్లాప్‌ కొట్టేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఆ తరవాత మహేష్‌ సెట్లో చేరతారు. కానీ రాజమౌళి సినిమా కోసం మాత్రం ఆ సెంటిమెంట్‌ బ్రేక్‌ చేశాడు. మహేష్‌ - రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. గురువారం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సెంటిమెంట్‌ ప్రకారం మహేష్‌ రాడనుకొన్నారంతా. కానీ.. ఆయన వచ్చి అందరికీ షాక్‌ ఇచ్చారు. షూటింగ్‌ ఎప్పుడన్నది ఇంకా తెలీలేదు. కాకపోతే సంక్రాంతి తరవాత మహేష్‌ పూర్తి స్థాయిలో చిత్రబృందానికి అందుబాటులో ఉంటానని చెప్పారట.

సంక్రాంతి తరవాత షూటింగ్‌ ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చు. కథానాయికగా ప్రియాంకా చోప్రాని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రతినాయకుచి?గా ఫృథ్వీరాజ్‌ కనిపించనున్నాడని సమాచారం. అఽధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే రాజమౌళి కోసం మహేష్‌ సెంటిమెంట్‌ బ్రేక్‌ చేయడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. రాజమౌళి సినిమా కోసం మహేష్‌ ఏమైనా చేస్తాడని, ఇది కేవలం ప్రారంభః మాతంమ్రే అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రాజమౌళి తన ప్రతి చిత్రానికి ఆనవాయితీగా వచ్చే ఏ సెంటిమెంట్‌పు పక్కనపెట్టారు. ఆయన తీసే ప్రతి సినిమాకు ముందు ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా కథ, లేదా అందులో విశేషాలనే వెల్లడించేవారు. కానీ ఈ సినిమాకు అదేమీ చేయకుండా సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేశారు. సినిమా ప్రారంభానికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఫుటేజ్‌ కూడా బయటకు రానివ్వలేదు.

Updated Date - Jan 03 , 2025 | 02:32 PM