Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 18 , 2025 | 08:03 PM

ఫైర్ బ్రాండ్ మాధవీ లత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అమ్మాయిలను అబ్బాయిలు చూసే విధానం, చూసిన తర్వాత వారు ఆలోచించే విధానంపై గట్టిగా క్లాస్ వేసుకుంది. బొట్టు, పూలు పెట్టుకున్న వాళ్లంతా మంచోళ్లు కాదు.. మోడ్రన్ డ్రస్సుల్లో ఉన్నోళ్లు చెడ్డోళ్లు కాదు.. అసలు ఈ రోజుల్లో పతివ్రతలనే వారే లేరమ్మా అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Madhavi Latha

రెండు రోజులుగా నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత (‘నచ్చావులే’ మూవీ ఫేమ్) ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణం జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీరియస్ అవుతుండటం, ఆయనపై కంప్లయింట్ చేయడం వంటి విషయాలతో ఆమె వార్తలలో నిలుస్తున్నారు. అదలా ఉంటే.. తాజాగా ఆమె సోషల్ మీడియాలో కాస్త మోడ్రన్‌గా కనిపించే అమ్మాయిలపై కామెంట్స్ చేసే వారికి సీరియస్‌ వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..


ఒక అమ్మాయి పద్దతిగా డ్రస్ వేసుకుని కనిపిస్తే.. అబ్బ మహా అందగత్తె, మహా సాంప్రదాయిణి, మహా మంచిది, ఎంత మంచిదో అంటుంటారు. ఒక్క మోడ్రన్ డ్రస్ వేసుకని ఫొటో షూట్ చేస్తే చాలు.. అబ్బ బరితెగించింది. పది మందితో అది.. వంద మందితో ఇది.. బట్టలిప్పేసి తిరుగుతుంది, చెడిపోయింది అంటూ చెండాలంగా మాట్లాడతారు. ఒక అమ్మాయి డ్రస్ టేస్ట్ మారితేనే ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు. మరి మీ భాష మారింది, మీ జడ్జిమెంట్ మారింది. మీ యొక్క ఆలోచనా విధానం మారింది. మీరంతా కూడా అదే జాతికి చెందినవారు. మీరంతా అది కాబట్టే కదా.. ఆ దృష్టితో చూస్తున్నారు. అంటే ఆ అమ్మాయి కంటే ముందే మీరు చెడిపోయారు. బరితెగించింది అనే భాష మాట్లాడుతున్నావంటే.. నువ్వు ఆల్రెడీ బరితెగించావ్ కదా. నిన్న మొన్నటి వరకు చాలా పద్దతిగా ఉండేది.. ఇవాళ ఇలా తయారైంది అని ఎలా అయితే అంటున్నావో.. అలాగే నీ ఆలోచన కూడా నిన్న మొన్నటి వరకు పద్ధతిగా ఉంది.. ఈ రోజు మారిపోయిందని అనుకోవచ్చు కదా. ఆడాళ్ల మానాల మీద, ప్రాణాల మీద బతికే ముం.. గాడివి నువ్వు. నువ్వు బతికే బతుకే అలాంటిది. మీరు ఎవరెవరైతే అలాంటి పనులు చేస్తారో.. అదే దృష్టితో చూస్తారు. మీ ఆలోచనను బట్టే ఎదుటి వారు అలా కనిపిస్తారు. ఒక అమ్మాయి మంచి డ్రస్ వేసుకుంటే వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తారు. బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకుని పద్దతిగా కనిపిస్తే.. మీ దృష్టిలో ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి మనసులో పాడు ఆలోచనలు ఉన్నా కూడా ఆ అమ్మాయి మీకు చాలా మంచిది. అదే ఒక అమ్మాయి మోడ్రన్ డ్రస్ వేసుకుంటే.. ఆ అమ్మాయి ఎంత మంచిదైనా కూడా మీ దృష్టిలో బజారుది అయిపోతుంది. బతికితే రాజ్యాంగ బద్దంగా బతకండి.


సోషల్ మీడియాలో ఒక యాంకర్ వాళ్ల భర్తతో ఫొటోలు దిగితే.. ఇంకేముంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ అనసూయ మీద కూడా ఇలాగే పడి ఏడుస్తున్నారు. అనసూయ ఒక నెల రోజుల్లో సంపాదించినంత ఉండదు మీ బతుకులు. మీరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటా బతుకుతున్నారు. అనసూయ రోజూ కష్టపడి పనిచేసుకుంటూ సంపాదించుకుంటుంది. ఎదిగేవాళ్ల మీద కామెంట్స్ చేసుకుంటూ బతికే నువ్వు అక్కడే ఉంటావు. ముందు నువ్వు ఎలా ఎదగాలో ఆలోచించు. అనసూయ ధైర్యవంతురాలు. తను ఎక్కడికి వెళ్లినా.. తనకొచ్చే గౌరవం తనకి వస్తుంది. కామెంట్ చేసే నీకు ఎవడైనా విలువ ఇస్తాడా? నీ ఈగో శాటిస్‌ఫ్యాక్షన్ చేసుకోవడం తప్ప.. ఏమైనా ఉందా? అనసూయకు నేను గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి.. ఎవడూ గౌరవం ఇవ్వకూడదంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఏమీ చేతకానీ చెమ్మచెక్కగాడివి కాబట్టి.. అక్కడే పడుంటావ్. ఎదుగుతున్నవాళ్ల మీద ఏడ్వడం తప్ప.. జీవితంలో నీకు ఏమీ చేతకాదు. ఇలాంటి వాళ్లు సోషల్ మీడియాలో 70 శాతం మంది ఉన్నారు. కాబట్టి అన్నీ మూసుకుని మీ పనులు మీరు చూసుకుంటే.. మా పనులు మేము చూసుకుంటాం.’’ అని వీడియోలో ఫైర్ అయిన మాధవీ లత.. భూమి మీద ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మ అంటూ ఈ వీడియోకు ఓ పోస్ట్ కూడా యాడ్ చేశారు. అందులో..

Also Read- Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!


‘‘భూమి మీద ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మ.. పచ్చిగా మాట్లాడితే ప్రతి ఒక్కరు మానసికంగా వ్యభిచారులే, ఎవరి ఆలోచనలు గొప్పగా లేవ్, ఎవరి చర్యలు ఉత్తమంగా లేవ్, పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగే యవ్వారమే. ఎవరికి వారు ఆడ మగ మరియు ఇతర జాతీయులు కలిపి ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరోజైనా మానసిక వ్యభిచారం చేసినవాళ్లే. శరీరం ఏముంది తప్పు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు తప్పు తెలుసుకున్న స్వామి అంటే.. కానీ మానసికంగా, ఆలోచనపరంగా చేసే తప్పుకి భగవంతుడు క్షమాభిక్ష పెట్టడు.

తప్పులెన్నువాడు తమ తప్పులెరుగడు, అందరూ సర్వమంగళ మేళాలే. ఎవరికి వారు కనీసం తెలిసి తప్పు చేయకూడదు, తెలిసి మోసం చేయకూడదు, తెలిసి ద్రోహం చేయకూడదు. మొహాలు, తాపాలు, ఆకర్షణలు సహజం. తప్పు అని తెలిశాక తెలుసుకుని మంచిగా బతుకే వాడికి మోక్షం, పుణ్యం వస్తుంది.


పాపం పనులు పాపపు మాటలు మీతో పాటు మీ వంశాన్ని నాశనం చేస్తుంది. కర్మ ఎవరిని వదలదు మీ మాటలు కూడా లెక్కించబడతాయి, ఆలోచన కూడా పాపం లిస్ట్‌లో ఉంటుంది. అయినా మేం పాపమే చేస్తాం అంటే చేయండి.. మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత నాశనం అవుతారు నాకు అదే కావాలి, తదాస్తు’’ అని మాధవీ లత చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

Also Read: Daaku Maharaaj Review: బాలయ్య నటించిన మాస్ మసాలా మూవీ ‘డాకు మహారాజ్’ ఎలా ఉందంటే

Also Read:Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 18 , 2025 | 08:03 PM