Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

ABN, Publish Date - Jan 21 , 2025 | 09:47 PM

కుంభమేళా మోనాలిసా‌కు బంపరాఫర్ వరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి రుద్రాక్షలు అమ్ముకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కి వచ్చిన మోనాలిసా.. ఇప్పుడో సెలబ్రిటీగా మారింది. కుంభమేళాలో ఆమెతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడుతున్నారు. చూడగానే కళ్లలో పడే ఆమె అందానికి అంతా ఫిదా అవుతున్నారు. అలా ఫిదా అయిన ఓ డైరెక్టర్ ఏం చేశాడంటే..

Kumbh Mela Monalisa

మోనాలిసా.. కాదు కాదు కుంభమేళా మోనాలిసా అంటే బాగుంటుంది. గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మాధ్యమాలలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. ఆమేం పెద్ద సెలబ్రిటీ కాదు, బాగా తెలిసిన ఫేస్ కూడా కాదు.. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకోవడానికి వచ్చిన కేవలం ఒక సాదారణమైన అమ్మాయి. అలాంటి అమ్మాయి కేవలం నాలుగంటే నాలుగే రోజుల్లో ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు సినిమా అవకాశం ఇచ్చేంతగా ఆమె పాపులారిటీని సంపాదించుకుంది. అదీ కూడా తన సహజ సౌందర్యంతోనే.


Also Read- Venu Swamy: సారీ చెప్పిన వేణు స్వామి.. ఇకపై అలా జరగదు!

సహజ సౌందర్యం అన్నాం కదా.. అని తనేమీ పెద్ద కలర్ కూడా కాదు. బ్లాక్ కలర్‌లోనే ఉంటుంది కానీ ఫేస్‌లో సిరి ఉట్టిపడుతుంది. అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూ ఉండే తన ముఖం అందరికీ బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కి వచ్చిన ఈ భామ.. ఎందుకు ఇలా రుద్రాక్షలు అమ్ముకుంటున్నావని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? తన తమ్ముడి చదువు కోసం తను ఇలా కష్టపడుతున్నట్లుగా చెప్పి.. అందరి మనసులలోనూ చోటు సంపాదించుకుంది. ఆర్థిక సమస్యలతో తన చదువు ఆపేసి, తన తమ్ముడినైనా చదివించుకోవాలనే ఇలా రుద్రాక్షలు అమ్ముతున్నట్లుగా మోనాలిసా చెప్పుకొచ్చింది.


Also Read- Priyanka Chopra: చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో పూజలు.. ఉపాసనకు థ్యాంక్స్

ఇక మోనాలిసా స్టోరీ, అలాగే ఆమె సహజ సౌందర్యం, కుంభమేళాలో ఆమె పాపులారిటీని గమనించిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ఆమెకు మూవీ ఛాన్స్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. తనకి ఒకవేళ యాక్టింగ్ రాకపోతే.. నేర్పించైనా సరే తన తదుపరి చిత్రం ‘డైరీ ఆఫ్ మణిపూర్’లో అవకాశం ఇస్తానని ప్రకటించడం చూస్తుంటే.. అతి త్వరలోనే మోనాలిసా కష్టాలన్నీ తీరి.. ఓ పెద్ద సెలబ్రిటీగా మారుతుందనడంలో అస్సలు అతిశయోక్తి లేదు. ఎందుకంటే, తనకున్న అందం అలాంటిది. పెద్ద పెద్ద కళ్లు, అమాయకపు చూపులు, ఆ చూపుల్లో కనిపించే స్వచ్ఛమైన అప్యాయత అన్నీ కూడా మోనాలిసాను సోషల్ మీడియా సెలబ్రిటీని చేసేశాయి. రైతు కూతురి పాత్రకు మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ.. డైరెక్టర్ సనోజ్ మిశ్రా నెటిజన్ల అభిప్రాయం కూడా అడిగాడు. అందరూ బాలీవుడ్ హీరోయిన్ మెటీరియల్ అన్నవారే తప్పితే.. ఒక్కరూ కూడా ఆమె గురించి నెగిటివ్‌గా కామెంట్ చేయలేదు. ఇక ఆలస్యం చేయను.. వెంటనే వెళ్లి ఆమెని కలిసి, సినిమాకు ఒప్పిస్తానని అంటున్నారు సనోజ్ మిశ్రా.


మొత్తంగా చూస్తే.. మహా కుంభమేళాలో చిన్నపాటి సెలబ్రిటీగా మారిన మోనాలిసా.. అతి త్వరలో బాలీవుడ్ తెరపై నటిగా దర్శనమివ్వడం పక్కా అనేలా ప్రపంచమంతా మాట్లాడుకుంటుండటం విశేషం. ఈ సోషల్ మీడియా క్వీన్‌కు ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది. అందులో ఆమె పోస్ట్ చేసే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు కుంభమేళాలో ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. సరిగా నిలబడి రుద్రాక్షలకు కూడా అమ్ముకోనివ్వడం లేదు. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఆమె చుట్టూ రక్షణ వలయం పెట్టాల్సి వచ్చేలా అక్కడ పరిస్థితి ఉంది. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.


Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‪కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 21 , 2025 | 09:49 PM