Thala Trailer: విజయ్ సేతుపతి చేతుల మీదుగా తలా ట్రైలర్
ABN, Publish Date - Feb 04 , 2025 | 04:31 PM
'రణం' దర్శకుడుగా సత్తా చాటారు అమ్మ రాజశేఖర్. తాజాగా అయన 'తలా' (Thala) చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ తమిళ్ ట్రైలర్ ను వెర్సటైల్ ప్యాన్ ఇండియా యాక్టర్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. అయన ట్రైలర్ కు ఇంప్రెస్ అయ్యి స్టార్ హీరో రేంజ్ సినిమాల ఉందని ప్రశంసించారు. ఇలాంటి మూవీతో డెబ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాగిన్ రాజ్ కు చాలా పెద్ద కెరీర్ ను ఇస్తుందని కితాబునిచ్చాడు. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. విజయ్ సేతుపతి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తమ టీం కి ఏంటో ఎనర్జీ ఇచ్చిందని అమ్మ రాజశేఖర్పా అన్నారు. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'తలా' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ‘వయొలెంట్ వాలెంటైన్’అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేయబోతుండటం విశేషం.
Updated at - Feb 04 , 2025 | 04:41 PM