Karthik Rodriguez: విడుదలైన ముత్తయ్య సెకండ్ సింగిల్
ABN, Publish Date - Apr 21 , 2025 | 04:57 PM
నటన అనే పిచ్చిపడితే... అది అంత త్వరగా మనిషిని వదిలిపోదు. డెబ్బై ఐదేళ్ళ వచ్చినా... సినిమాల్లో నటించాలని తహతహలాడే వృద్ధుడి కథే 'ముత్తయ్య'.
'బలగం' (Balagam) ఫేమ్ కె. సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ ప్లే చేసిన 'ముత్తయ్య' (Muthayya). ఇందులో ఇతర ప్రధాన పాత్రలను అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ తదితరులు పోషించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ దీనిని నిర్మించారు. అతి త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇందులోని 'సీనిమాల యాక్ట్ జేసి...' అనే పాటను విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతం సమకూర్చారు. దర్శకుడు భాస్కర్ మౌర్య రాసిన ఈ పాటను కె. చిన్నా పాడారు. 75 సంవత్సరాల ముత్తయ్యకు సినిమాల్లో నటించాలనేది కోరిక. ఆ వెండికల నేపథ్యంలో ఈ పాట సాగుతుంది.