Toxic: మోస్ట్ 'టాక్సిక్' గ్లిమ్ప్స్.. పెద్దలకు సందేశం
ABN, Publish Date - Jan 08 , 2025 | 11:06 AM
Toxic: పరిశ్రమలో ఇప్పటివరకు పిల్లల కోసం చాలా సినిమాలు వచ్చాయి. కానీ మేము ఈ సినిమాతో పెద్దలకు సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. ప్రస్తుతం మనలో చాలామంది గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం. ‘టాక్సిక్’ అనే పదాన్ని ఎన్నో సందర్భాల్లో వాడుతుంటాం. ఇప్పుడంతా విషపూరిత పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అందుకే ఈ టైటిల్, ట్యాగ్‌లైన్ కథకు, సందర్భానుగుణంగా ఉంటుందనిపించింది అన్నారు హీరో యశ్.
'కేజీఎఫ్’ (KGF) సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు కన్నడ హీరో యశ్ (Yash). ప్రస్తుతం ఆయన మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ (Geethu mohan das) దర్శకత్వంలో ‘టాక్సిక్’ (toxic) చిత్రం చేస్తున్నారు. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. యశ్ హీరోగా నటిస్తున్న 19వ చిత్రమిది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈరోజు యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు.
Updated at - Jan 08 , 2025 | 11:08 AM