Tribanadhari Barbarik: స్వీయ నాశనానికి మూడు మార్గాలు..
ABN, Publish Date - Jan 03 , 2025 | 03:26 PM
సత్యరాజ్‌ప్రధాన పాత్రలో ‘ త్రిబాణధారి బార్బరిక్’ అనే సినిమా తెరకెక్కుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మారుతి ఇందులో భాగస్వామి. ఈ చిత్రంలో యాంకర్ ఉదయ్ భాను విలనిజం చూపించబోతోందట.
టాలీవుడ్ నుండి మరో ఆసక్తికర పాన్ ఇండియన్ మూవీ రావడానికి సిద్ధమైంది. సత్యరాజ్, సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రల్లో నటించగా, యాంకర్ ఉదయభాను విలన్ పాత్ర పోషించింది. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు.